రజనీ బోర్ కొట్టిస్తున్నారు: కస్తూరి, నోరు మూసుకోవాలంటూ.. ఫ్యాన్స్‌తో ఫైట్

రజనీకాంత్ రాజకీయ ఆరేంగేట్రం సస్పెన్స్‌పై నటి కస్తూరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ పోర్, పోర్ అంటున్న మీ మాటలు విని బోర్ కొడుతోందని సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

చెన్నై: రజనీకాంత్ రాజకీయ ఆరేంగేట్రం సస్పెన్స్‌పై నటి కస్తూరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ పోర్, పోర్ అంటున్న మీ మాటలు విని బోర్ కొడుతోందని సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

'రజనీ.. యుద్ధం (పోర్) అంటున్న మీ మాటలు విని బోర్ కొడుతోంది స్వామి. రాజకీయ ప్రవేశంపై స్పష్టమైన ప్రకటన చేయకుండా పోరు వచ్చినప్పుడు చూసుకుందామని రజనీకాంత్ చేస్తున్న ప్రకటనలు బోర్ కొడుతున్నాయి. అనిశ్చితి పరిస్థితిలోను స్థిరమైన నిర్ణయాన్ని తక్షణం తీసుకునే వాడే నిజమైన రాజకీయ నాయకుడు. రజనీ కూడా ఏదో ఒక స్థిరమైన నిర్ణయాన్ని త్వరగా తీసుకోవాలి' అని కస్తూరి ట్వీట్ చేశారు.

మంచి నేత కోసం ఎదురు చూసే తరుణంలో కూడా రాజకీయ ప్రవేశ నిర్ణయంపై తీసుకోవడానికి ధైర్యం కావాలన్నారు. వస్తానో.. రానో అంటూ రజనీకాంత్ ఏళ్ల తరబడి ఆలోచిస్తున్నారని ఆమె అభిప్రాయపడ్డారు.

దీనిపై రజనీకాంత్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెపై విరుచుకు పడ్డారు. 'నీవు కూడా రజనీకాంత్ గురించి మాట్లాడుతున్నావా.. అంతా టైమ్.. ఏం చేస్తాం.. నోరు మూసుకొని పోవే' అని ఓ అభిమాని ఘాటుగా స్పందించాడు.

ఇందుకు కస్తూరి కూడా ధీటుగా సమాధానం చెప్పింది. నీవు పుట్టక ముందు నుంచి నేను రజనీకాంత్ అభిమానిని అని, నీలాంటి మర్యాదలేని అభిమానుల వల్ల ఆయనకు చెడ్డపేరు, అవమానం.. ముందు నీ నోరు మూసుకో అని హితవు పలికింది.

Kasturi doubts superstar Rajinikanth!

రజనీకి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారని, సినిమా రంగంలో ఉండి విమర్శిస్తున్నావు.. ఎంత అమర్యాద అని మరో అభిమాని కామెంట్ చేశారు.

దీనిపై కూడా కస్తూరి సమాధానం చెప్పారు. నేను రజనీకి వీరాభిమానిని, తాను చేసేది విమర్శలు కాదని, విరక్తితో అంటున్న మాటలు, ఇదే విరక్తి అందరి మనస్సులోను ఉందని, అదే నేను చెబుతున్నానని వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+