షాక్: క్లాస్‌రూంలో పదో తరగతి అమ్మాయి దుస్తులు విప్పించిన టీచర్
మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. దొంగతనం చేసిందనే అనుమానంతో ఓ టీచర్.. పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని బట్టలు విప్పించింది.
భోపాల్: మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. దొంగతనం చేసిందనే అనుమానంతో ఓ టీచర్.. పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని బట్టలు విప్పించింది.
దమోహ్ జిల్లాలో గల ఓ పాఠశాలలో రూ.70 దొంగిలించిందని బాధితురాలిపై తోటి విద్యార్థిని ఆరోపించింది. తొలుత ఆమె పుస్తకాల సంచిని టీచర్ వెదికారు. డబ్బులు దొరకలేదు. దీంతో ఆమె బట్టలు విప్పి వెదకాల్సిందిగా సాటి విద్యార్థినిని ఆదేశించారు.

తరగతి గతిలో దుస్తులు విప్పించారని ఫిర్యాదు
తరగతి గదిలోనే అందరిముందు జరిగిన ఈ దారుణంపై బాధిత విద్యార్థిని పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. విషయం తెలిసి పాఠశాలకు షోకాజు నోటీసు జారీ చేశామని డీఈవో చెప్పారు.

మాంత్రికుడి వద్దకు తీసుకెళ్తానంటే ఓకే చెప్పింది
అమ్మాయి దుస్తులు విప్పించిన ఉపాధ్యాయురాలి పేరు జ్యోతి. తొలుత ఆ బాలిక బ్యాగ్ వెదికారు. ఆ తర్వాత నీవు దొంగతనం చేశావని నిజం ఒప్పుకోకుంటే మాంత్రికుడి వద్దకు తీసుకు వెళ్తానని కూడా ఆ విద్యార్థినిని టీచర్ బెదిరించింది.

కానీ దుస్తులు విప్పించింది
తాను రూ.70 తీయలేదని స్పష్టంగా చెప్పానని, తనను మాంత్రికుడి వద్దకు తీసుకువెళ్లినా ఫర్వాలేదని చెప్పానని బాధిత అమ్మాయి చెప్పింది. అలా ఒప్పుకున్నప్పటికీ టీచర్ మాత్రం అందరి ముందు క్లాస్ రూంలోనే ఆమె దుస్తులను విప్పించి, తనిఖీ చేయించింది.

షోకాజ్ నోటీసులు జారీ
ఈ విషయాన్ని బాధిత బాలిక ఇంటికి వెళ్లాక తన తల్లిదండ్రులకు చెప్పింది. వారు స్కూల్ యాజమాన్యం దృష్టికి తీసుకు వెళ్లారు. శుక్రవారం సాయంత్రం ఈ విషయం శుక్రవారం సాయంత్రం డీఈవో దృష్టికి వచ్చింది. దీంతో షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

అలా చేయడం సరికాదు
ఈ ఘటన పట్ల చర్యలు తీసుకుంటామని ఓ ఛానల్‌తో డీఈవో అన్నారు. బలవంతంగా దుస్తులు విప్పించడం సరికాదని, అలా చేయడం ఎవరికీ హక్కు లేదని చెప్పారు.

తరగతి గదిలో ఎవరూ లేరని టీచర్
దీనిపై టీచర్ జ్యోతి వాదన మరోలా ఉంది. ఆ సమయంలో తరగతి గదిలో ఎవరూ లేరని చెప్పారు. అందరు కూడా జూడో కరాటే ప్రాక్టీస్ కోసం వెళ్లారని చెప్పారు. ఆ సమయంలో బాధిత బాలిక, రూ.70 పోగొట్టుకున్న బాలిక, తాను మాత్రమే ఉన్నామని చెప్పారు. అంతేకాకుండా తాను కేవలం బ్యాగ్ మాత్రమే వెతకమని చెప్పానని, కానీ హఠాత్తుగా ఆమె దుస్తులు విప్పించిందని చెప్పింది.












Click it and Unblock the Notifications