‘అమెరికాకు హిందువు అధ్యక్షుడు కావొచ్చు’

అమెరికా అధ్యక్షుడిగా వైట్‌హౌస్‌లో నిర్వహించిన తన చివరి ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో బరాక్‌ ఒబామా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడిగా వైట్‌హౌస్‌లో నిర్వహించిన తన చివరి ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో బరాక్‌ ఒబామా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికా.. ప్రజలలో ప్రతిభను గుర్తిస్తూ, అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ ముందుకెళ్తొందని ఆయన అన్నారు. అంతేగాక, భవిష్యత్తులో మహిళా అధ్యక్షురాలు రావడం మాత్రమే కాదు.. లాటిన్‌ అధ్యక్షుడో.. యూదు అధ్యక్షుడో.. హిందూ అధ్యక్షుడు కూడా రావొచ్చు' అని వ్యాఖ్యానించారు.

'అమెరికాలో అన్ని వర్గాల ప్రజల నుంచి ప్రతిభావంతులు రావడం చూడగలుగుతాం. ఇదే మన దేశానికి బలం' అని ఒబామా చెప్పారు. అవకాశాలను అందరికీ సమంగా అందించడాన్ని మనం కొనసాగించాలని సూచించారు.

Meritocratic America could have woman, Latino or Hindu President in future: Barack Obama

కొంత కాలానికి అన్ని రకాల అధ్యక్షులు వస్తారని, అప్పుడు వాళ్లని ఏమని పిలవాలో కూడా తెలియకపోవచ్చు అంటూ నవ్వేశారు. నల్లజాతీయుడు అధ్యక్షుడు కావడం మళ్లీ జరిగే అవకాశం ఉందా? అని మీడియా అడిగిన ప్రశ్నకు దేశంలో విస్తరిస్తున్న అసమానతలను అమెరికా గుర్తించాల్సిన అవసరం ఉందని అందరినీ కలుపుకొని ముందుకెళ్లాలన్నారు.

ముఖ్యంగా మైనార్టీల విషయంలో శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ట్రంప్‌ పేరు ప్రస్తావించకుండా ఆయనను ఉద్దేశించి ఒబామా పలు వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్ష పదవి నుంచి వైదొలిగిన తర్వాత తన పిల్లల కోసం పూర్తి సమయం కేటాయిస్తానని ఒబామా చెప్పుకొచ్చారు. కాగా, శుక్రవారం నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు చేపట్టనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+