షాక్: నడిరోడ్డుపై భారీ హెలికాప్టర్ దించి అడ్రస్ అడిగాడు!(వీడియో)
రోడ్డు మార్గంగా వెళ్లే వాహనదారులే ఎక్కువగా తమకు తెలియని ప్రాంతాలకు వెళ్లినప్పుడు.. తమ వాహనాలను ఆపి స్థానికులతో మాట్లాడి తమకు కావాల్సిన చిరునామాను తెలుసుకుంటారు.
అస్తానా: రోడ్డు మార్గంగా వెళ్లే వాహనదారులే ఎక్కువగా తమకు తెలియని ప్రాంతాలకు వెళ్లినప్పుడు.. తమ వాహనాలను ఆపి స్థానికులతో మాట్లాడి తమకు కావాల్సిన చిరునామాను తెలుసుకుంటారు. ఇక్కడ మాత్రం ఓ హెలికాప్టర్ పైలట్ ఏకంగా రోడ్డుపైనే హెలికాప్టర్ ల్యాండ్ చేసి అటుగా వెళుతున్న లారీ డ్రైవర్‌ను అడ్రస్ అడిగాడు. ఈ పరిణామంతో ఆ లారీ డ్రైవర్ ఆశ్చర్యానికి గురయ్యాడు. కజకిస్థాన్‌లో చోటు చేసుకుందీ ఘటన.
వివరాల్లోకి వెళితే.. కజఖస్థాన్‌లోని ఓ జాతీయ రహదారిపై వరుసగా లారీలు వెళ్తున్నాయి. ఆ ప్రాంతం చుట్టూ మంచు.. రహదారి తప్ప ఏమీ కనిపించని పరిస్థితి ఉంది. కాగా, ఆ మంచు దుప్పట్లోంచి ఒక్కసారిగా కజఖస్థాన్ ఆర్మీకి చెందిన ఎంఐ-80 హెలికాప్టర్ ఒకటి లారీల ముందు.. నడిరోడ్డుపై ల్యాండ్ అయింది. దీంతో లారీ డ్రైవర్లంతా ఆశ్చార్యానికి గురయ్యారు. ఏం జరుగుతుందో వారికి అర్థం కాలేదు.
కాగా, క్షణాల్లో ఆ హెలికాప్టర్ నుంచి పైలట్ కిందికి దిగి ముందు ఆగిన లారీ డ్రైవర్ వద్దకు వచ్చి కరచాలనం చేశాడు. అక్తుబిన్సిక్ నగరానికి ఎలా వెళ్లాలని అడిగి తెలుసుకున్నాడు. లారీడ్రైవర్ సూచనమేరకు తిరిగి పయనమయ్యాడు. ఈ విచిత్ర ఘటనకు లారీ డ్రైవర్లు బిత్తరపోయారు.
ఇంత భారీ హెలికాప్టర్‌ని రోడ్డుపై దించి.. చిరునామా అడగటం ఏంటని విస్తుపోయారు. కాగా, ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి హల్‌చల్ చేస్తోంది. దీనిపై స్పందించిన ఆ దేశ రక్షణ శాఖ శిక్షణలో భాగంగా శిక్షణ పైలట్లకు గమ్యం చెప్పకుండా.. వెళ్లిన చోటును కనుక్కునేలా చేయాలని వారిని అలా పంపామని వివరణ ఇవ్వడంతో ఈ ఘటనపై కొంత స్పష్టత వచ్చింది.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications