రోజా ఐరన్ లెగ్ కాదు.. అదృష్టవంతురాలు: అది చూశాక జనం మాట!

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ప్రత్యర్థి పార్టీల నేతలు వైసీపీ ఎమ్మెల్యే రోజాను ఐరన్ లెగ్ అంటూ టార్గెట్ చేయడం తెలిసిందే. ఆమె ఏ పార్టీలో అడుగుపెడితే.. ఆ పార్టీ ఎన్నికల్లో గెలవదంటూ తరుచూ విమర్శిస్తుంటారు. కానీ నగరి ప్రజలు మాత్రం 'రోజా ఐరన్ లెగ్ కాదు.. అదృష్టవంతురాలు' అంటూ పొగుడుతున్నారట.

ఎందుకీ కితాబు అంటే.. నగరిలో రోజా కొత్తగా నిర్మిస్తున్న ఇంటి గురించి చెప్పుకోవాలి. నియోజకవర్గంలోని ప్రజలకు అందుబాటులో ఉండటం కోసం అక్కడే సొంతింటిని నిర్మించుకుంటున్నారు రోజా. ఇందుకోసం సోమవారం మంచి రోజు కావడంతో.. భూమి పూజ కూడా చేశారు.

mla roja performs bhumi pooja for new residence in nagari

భర్త సెల్వమణి, ఇద్దరు పిల్లలతో కలిసి రోజా భూమి పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటి ఆవరణలో బోరు బావి ఏర్పాటు కోసం రోజా పూజ చేశారు. అనంతరం 70అడుగుల లోతులోనే అందులోంచి నీళ్లు ఉబికిరావడంతో రోజా సంబరపడిపోయారట. దీంతో 'రోజా ఐరన్ లెగ్ కాదు.. అదృష్టవంతురాలు' అంటూ అక్కడి జనం చర్చించుకోవడం కనిపించిందని చెబుతున్నారు.

mla roja performs bhumi pooja for new residence in nagari
Fire Brand Roja : MLA Roja Fulfill Fire Brand Tag - Oneindia Telugu

ఏదేమైనా రెండేళ్లు ముందుగానే వైసీపీ ఎన్నికల సమరాన్ని మొదలుపెట్టడంతో.. నియోజకవర్గంపై మరింత ఫోకస్ చేసేందుకే రోజా అక్కడ ఇంటిని నిర్మించుకున్నట్లుగా చెబుతున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSRCP MLA Roja performed Bhumi Puja for new residence in Nagari constituency.
Please Wait while comments are loading...