హోంమంత్రి చినరాజప్ప మండలంలో అశ్లీల నత్యాలు
హోంమంత్రి చినరాజప్ప సొంత మండలంలో శనివారం రాత్రి అశ్లీల నృత్యాలు జరగడం విమర్శలకు దారి తీసింది.
విజయవాడ: హోంమంత్రి చినరాజప్ప సొంత మండలంలో శనివారం రాత్రి అశ్లీల నృత్యాలు జరగడం విమర్శలకు దారి తీసింది. ఉప్పలగుప్తం మండలంలోని గొల్లవిల్లి, భీమనపల్లిలో రాత్రంతా అశ్లీల నృత్యాలు చోటు చేసుకున్నాయి.

పోలీసులు పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కానీ అశ్లీల నృత్యాలు జరగడంపై విమర్శలు వస్తున్నాయి.
ఇదిలా ఉండగా, సంక్రాంతి పండుగ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలో కోడి పందేలు జోరుగా కొనసాగుతున్నాయి. ఆదివారం భీమవరం, ఉంగటూరు, తణుకు పరిసర ప్రాంతాల్లో కోడిపందేలు పెద్దఎత్తున నిర్వహిస్తున్నారు. ఒక్కో పందెంలోనూ లక్షల్లో నగదు చేతులు మారుతోందని అంటున్నారు.












Click it and Unblock the Notifications