పన్నీర్ అలా చేయగలిగితే.. తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పినట్టే!?

ప్రస్తుతం తెర మీద కనిపిస్తున్న రాజకీయ బలాన్ని బట్టి చూస్తే.. శశికళ వెనుకే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉండగా.. చివరిదాకా వారంతా ఆమెతోనే ఉంటారా? అన్న దానిపై ఆమె సీఎం అయ్యే అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.

చెన్నై: పన్నీర్-శశికళ నడుమ తమిళ సీఎం పీఠం దోబూచులాడుతున్న తరుణంలో.. ఇద్దరిలో సీఎం కుర్చీని కైవసం చేసుకోబోయెదెవరు? అన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. క్షణ క్షణానికి మారుతోన్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో.. చివరాఖరికి సీఎం పదవి ఎవరికి దక్కుతుందన్న చర్చ ఇప్పుడు తమిళనాట జోరుగా జరుగుతోంది.

ప్రస్తుతం తెర మీద కనిపిస్తున్న రాజకీయ బలాన్ని బట్టి చూస్తే.. శశికళ వెనుకే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉండగా.. చివరిదాకా వారంతా ఆమెతోనే ఉంటారా? అన్న దానిపై ఆమె సీఎం అయ్యే అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఇక మరోవైపు శశికళ మీద తిరుగుబాటు బావుటా ఎగరేసిన పన్నీర్ సెల్వం.. సీఎం కుర్చీ కోసం పావులు కదుపుతూనే ఉన్నారు.

Panneerselvam has a chance to become CM with the support of his community MLAs

పరిశీలకుల అభిప్రాయాలను బట్టి చూస్తే.. పన్నీర్ తన సొంత సామాజిక వర్గమైన దేవర్ వర్గాన్ని తనవైపుకు తిప్పుకోగలిగితే.. తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పే అవకాశం ఆయనకు దక్కుతుంది. అన్నాడీఎంకేకు ఉన్న 134 మంది ఎమ్మెల్యేల్లో 38 మంది దేవర్ సామాజిక వర్గానికి చెందినవారే ఉండటంతో.. వారంతా పన్నీర్ కు అండగా నిలబడితే.. డీఎంకె మద్దతుతో ఆయన తన అధికారాన్ని నిలబెట్టుకోవచ్చు.

ఇదే గనుక జరిగితే.. శశికళ వర్గంలోని మరో 30-40మంది ఎమ్మెల్యేలు కూడా పన్నీర్ చెంత చేరే సూచనలు కనిపిస్తున్నాయని అంచనా వేస్తున్నారు. కాగా, ప్రస్తుతం శశికళకు అండగా ఉన్న ఎమ్మెల్యేల్లో దాదాపు 18మంది దేవర్ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే శశికళ కూడా దేవర్ సామాజిక వర్గానికి చెందినవారే కావడం.. పన్నీర్ కు కాస్త ప్రతికూలాంశమే.

ఏదేమైనా గురువారం నాడు గవర్నర్ తమిళనాడులో అడుగుపెట్టే సూచనలున్న నేపథ్యంలో.. అన్నాడీఎంకె రాజకీయాలు ఏ కీలక మలుపు తీసుకుంటాయో వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+