పవన్ గత జన్మలో రాజు: సంచలనంగా మారిన ఆస్ట్రో సైకాలజిస్ట్ వీడియో ఇదే
ప్రముఖ ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్వీ నాగనాథ్ మాత్రం ప్రముఖుల గత జన్మల వివరాలను తెలుపుతూ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారారు.
హైదరాబాద్: సాధారణంగా ఎవరికైనా గత జన్మ గురించిన వివరాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. కానీ, అందరికీ సాధ్యపడదు. అయితే, ప్రముఖ ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్వీ నాగనాథ్ మాత్రం ప్రముఖుల గత జన్మల వివరాలను తెలుపుతూ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారారు.

ఎస్వీనాగనాథ్ వీడియో వైరల్
జనసేన పార్టీ అధినేత, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత జన్మఎలా ఉండేది? గత జన్మ ఎక్కడ ఎలా సాగింది? అనే విషయాలపై ప్రముఖ ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్వీ నాగనాథ్ చేసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ హల్‌చల్ చేస్తోంది.

రాజుల కుటుంబంలో..
ఈ వీడియోలో పవన్ గత జన్మలో రాజుల కుటుంబంలో జన్మించాడని, ఆయన గత జీవిత విశేషాలను ప్రముఖ ఆస్ట్రో సైకాలజిస్ట్ ఎస్వీనాగ్‌నాథ్ తెలిపారు. పవన్ గత జన్మ మరణం ఎలా సంభవించిందో కూడా తెలిపారాయన.

పవన్ లైఫ్ ఆసక్తికరం
నమస్తే తెలుగు ఛానల్‌లో హూ ఐయామ్ ఐ(who am I) ఎపిసోడ్
ప్రసారమవుతోంది. ఇందులో ప్రముఖుల గత జన్మ రహస్యాలను
జ్యోతిష్య శాస్త్ర ఆధారంగా చెబుతారు. ఇందులో తాజాగా ప్రసారమైన
పవన్ పాస్ట్ లైఫ్ ఎపిసోడ్ ఇప్పుడు హాట్ టాపిక్ మారింది.

ఆసక్తికర విషయాలు
పవన్ గత జన్మ జీవితంపై చేసిన ఈ ఎపిసోడ్‌లో ఎస్వీనాగ్‌నాథ్ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. కాగా, సినీ, రాజకీయ ప్రముఖులందరి పాస్ట్ లైఫ్ ఎపిసోడ్‌లతో ఈ కార్యక్రమం ఉంటుందని, ప్రతి వారం ఒక ఎపిసోడ్ ప్రసారమవుతుందని ప్రొగ్రామ్ డైరెక్టర్ స్వామి ముద్దం తెలిపారు. తొలి ఎపిసోడ్ ప్రసారం చేసిన పవన్ కళ్యాణ్ పాస్ట్ లైఫ్ వీడియోకు విశేష స్పందన వస్తోందని చెప్పారు.












Click it and Unblock the Notifications