జగన్ కోసం.. తీగ లాగితే: బాబుకు అడ్డంగా దొరికిన ప్రశాంత్ కిషోర్

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వైసిపి అధినేత జగన్‌కు చాలా రోజుల నుంచే పని చేస్తున్నారా? తప్పుడు ఖాతాలతో అడ్డంగా దొరికిపోయారా? అంటే అవుననే అంటున్నారు.

అమరావతి: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వైసిపి అధినేత జగన్‌కు చాలా రోజుల నుంచే పని చేస్తున్నారా? తప్పుడు ఖాతాలతో అడ్డంగా దొరికిపోయారా? అంటే అవుననే అంటున్నారు.

ఉత్తరాది పేర్లతో పోస్టులు.. ప్రశాంత్ కిషోర్ వ్యూహం

ఉత్తరాది పేర్లతో పోస్టులు.. ప్రశాంత్ కిషోర్ వ్యూహం

సీఎం చంద్రబాబుకు, రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల వ్యతిరేక పోస్టులు పెరిగాయని అంటున్నారు. ఈ పోస్టులు ఉత్తరాది పేర్లతో ఉన్నాయి. దీంతో టిడిపి నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గోస్వామి, మెహతా, అరోరా వంటి పేర్లు ఉండటంతో టిడిపి ఆరా తీసింది.

Recommended Video

    YSRCP chief YS Jaganmohan Target Ap Government In 2019 - Oneindia Telugu
    తీగ లాగితే డొంక

    తీగ లాగితే డొంక

    టిడిపి నేతలు తీగ లాగితే అసలు డొంక బయటపడిందని తెలుస్తోంది. ఇదంతా ప్రశాంత్ కిషోర్ వ్యూహంలో భాగమని టిడిపి నేతలు గుర్తించినట్లుగా చెబుతున్నారు. 2014 నుంచి ప్రశాంత్ కిషోర్‌కు ఎన్నికల వ్యూహకర్తగా మంచి పేరు వచ్చింది. అప్పుడు ఎన్డీయేకు, ఆ తర్వాత యూపీ, పంజాబ్‌లలో కాంగ్రెస్ పార్టీకి పని చేశారు.

    అప్పట్లోనే పెద్ద ఎత్తున ఖాతాలు

    అప్పట్లోనే పెద్ద ఎత్తున ఖాతాలు

    ఆయన అప్పట్లోనే సోషల్ మీడియాలో చాలా ఖాతాలు తెరిచారు. వాటి ద్వారా తమ వ్యూహానికి అనుకూలంగా పోస్టింగులు చేస్తూ వచ్చారు. అవే అకౌంట్లను ఇప్పుడు ఏపీకి కూడా ఉపయోగిస్తున్నట్లు టిడిపి నేతలు గుర్తించారని తెలుస్తోంది.

    అక్కడే పొరపాటు

    అక్కడే పొరపాటు

    ప్రశాంత్ కిషోర్ బృందం చేసిన పొరపాటు వల్ల వారు టిడిపికి అడ్డంగా దొరికిపోయారని అంటున్నారు. పాత అకౌంట్లనే ఉపయోగించడంతో టిడిపి నేతలు గుర్తించారు. అంతేకాదు, పంజాబ్, యూపీ, ఇతర రాష్ట్రాల ఎన్నికల సమయంలో చేసిన వ్యాఖ్యలు కూడా ఆ అకౌంట్ల నుంచి తొలగించలేదు. అవి అలాగే ఉండిపోయాయి.

    వేలాది ఖాతాలు తెరిపించారు

    వేలాది ఖాతాలు తెరిపించారు

    ప్రశాంత్ కిషోర్ బృందం సోషల్ మీడియాలో వేలాది ఖాతాలు తెరిచినట్లు టిడిపి అంచనా వేస్తోంది. ట్విట్టర్, ఫేస్‌బుక్ ఖాతాల్లో చంద్రబాబు, టిడిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెడుతున్న ఎక్కువ పోస్టులు ప్రశాంత్ కిషోర్ బృందం ఆపరేషన్‌గా తేలిందని టిడిపి నేతలు కూడా చెబుతున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+