వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: తన కంటే ముందు నడుస్తోందని భార్యకు విడాకులిచ్చేశాడు!

|
Google Oneindia TeluguNews

దుబాయ్‌: సౌదీలో మహిళల కంటే పురుషులకే ఎక్కువ స్వేచ్ఛ ఉంటుందనే విషయం తెలిసిందే. కాగా, తాజాగా జరుగుతున్న ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. తన కంటే ముందు నడిచిందనే కారణంతో ఏకంగా కట్టుకున్న భార్యకే విడాకులిచ్చేశాడు ఓ భర్త. తాను ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతోనే ఇలా చేశానంటు అతడు పేర్కొనడం గమనార్హం. ఇలాంటి ఘటనలో సౌదీలో ఇటీవల కాలంలో పెరిగిపోవడం గమనార్హం.

ముందు నడిచిందని..

ముందు నడిచిందని..

‘ది గల్ఫ్‌ న్యూస్‌' సోమవారం ప్రచురితం చేసిన కథనం ప్రకారం.. తనకంటే ఒక అడుగు వెనకగా నడవాల్సిందిగా ఎంత చెప్పినా వినిపించుకోకుండా ముందుగా అడుగులు వేసినందుకు అతడు.. ఏకంగా భార్యకు విడాకులే ఇచ్చేశాడు.

Recommended Video

Dhoni's Academy in Dubai | Oneindia Telugu
ఇది కూడా కారణమేనా?

ఇది కూడా కారణమేనా?

ఇక మరో వివాహితుడు అయితే తన స్నేహితులకు ఏర్పాటు చేసిన విందులో పద్ధతి ప్రకారం మేకతలను ముందుగా టేబుల్‌ వద్ద ఉంచనందుకు భార్యపై అసహనం వ్యక్తం చేశాడు. అంతేగాక, అతిథులంతా వెళ్లిపోయాక ఆమెపై విరుచుకుపడ్డాడు. అత్యంత కీలకమైన ఆ చర్య చేపట్టనందుకు వాళ్లందరి ముందు తలకొట్టేసినట్లయిందంటూ భార్యపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. చివరకు విడాకులిచ్చేశాడు.

హనీమూన్‌లోనే విడాకులు..

హనీమూన్‌లోనే విడాకులు..

ఇంకో సంఘటనలో అయితే హనీమూన్‌ సమయంలోనే భార్యకు విడాకులిచ్చేశాడు ఓ భర్త. ఆమె కాళ్లకు కడియాలు వేసుకోవడమే అతడి కోపానికి కారణం కావడం గమనార్హం. కాళ్లకు ఈ కడియాలేమిటి అంటూ భార్యపై మండిపడిన అతడు.. ఆ తర్వాత ఆమెకు విడాకులిచ్చేశాడు.

చిన్న కారణాలతోనే..

చిన్న కారణాలతోనే..

కాగా, ఇటీవలి కాలంలో.. చిన్నచిన్న కారణాలక్కూడా విడాకులిచ్చేయడం పెరిగిపోతోందని సౌదీ అధికారి ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. కుటుంబ పెద్దలు ఇలాంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే మంచిదని అభిప్రాయపడ్డారు.

English summary
Saudis are becoming increasingly alarmed over the rate of divorces in the country for trivial reasons. In one case, a Saudi man divorced his wife after she kept walking ahead of him despite his repeated warnings to keep a step behind him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X