'దేవుడు-సెక్స్.. ఈ రెండూ ఇండియన్స్‌ను వణికిస్తున్నాయి"
దేవుడు అన్న పదం లాగే సెక్స్ పదం కూడా ప్రజలను భయపెడుతోందన్నారు.
Recommended Video

న్యూఢిల్లీ: ఇండియా లాంటి దేశాల్లో 'సెక్స్' గురించి మాట్లాడటం, చర్చ చేయడం అంత తేలికైన పని కాదు. ముఖ్యంగా మహిళలకు. సెక్స్ గురించి ఎడ్యుకేట్ చేయడాన్ని కూడా నీచంగా చూసే ఒక సంస్కృతి ఇక్కడ పాతుకుపోయి ఉంది. ఈ రకమైన వాతావరణం స్త్రీ స్వేచ్చను అడ్డుకుంటుందనేది చాలామంది ఫెమినిస్టుల వాదన.
తాజాగా రచయిత శోభా డే ఇండియాలో సెక్స్‌పై అన్న పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేవుడు అన్న పదం లాగే సెక్స్ పదం కూడా ప్రజలను భయపెడుతోందన్నారు. ఈ రెండింటిని హింసాత్మక కార్యకలాపాల కోసం ఉపయోగించుకుంటున్నారని ఆమె అభిప్రాయపడ్డారు. కామ అన్న పదం అందమైనదనీ, కానీ కామసూత్ర ఒక జిత్తులమారి వ్యవహారమని అన్నారు.

శృంగారాన్ని భారతీయులు బాగానే ఆస్వాదిస్తారని ప్రపంచం మొత్తం అనుకుంటోందని, అయితే దేశంలో మాత్రం దానిని వేరే రకంగా ఉపయోగించుకుంటున్నారని శోభా డే అన్నారు. కొంతమంది తమ లక్ష్యాలను చేరుకోవడం కోసం సెక్స్, గాడ్ వంటి పదాలను ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు.
కసౌలో జరిగిన కుశ్వంత్‌సింగ్ ఆరో ఎడిషన్ సాహితీ వేడుకలో 'కామ మరియు మంచితనపు కష్టం' అన్న అంశంపై మాట్లాడుతూ శోభా డే ఈ వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications