వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘భారీ బందోబస్త్’: శోభాడేకు ముంబై పోలీస్ స్ట్రాంగ్ కౌంటర్

తరచూ వివాదాస్పద ట్వీట్లు, వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న ప్రముఖ రచయిత, కాలమిస్టు శోభా డే మరోసారి అలాంటి పనే చేశారు. మంగళవారం ముంబైలో జరిగిన బీఎంసీ ఎన్నికల సందర్భంగా ‘భారీ పోలీసు బందోబస్తు’ .

|
Google Oneindia TeluguNews

ముంబై: తరచూ వివాదాస్పద ట్వీట్లు, వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న ప్రముఖ రచయిత, కాలమిస్టు శోభా డే మరోసారి అలాంటి పనే చేశారు. మంగళవారం ముంబైలో జరిగిన బీఎంసీ ఎన్నికల సందర్భంగా 'భారీ పోలీసు బందోబస్తు' అంటూ లావుగా ఉన్న ఓ పోలీసు ఫోటోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

అధిక బరువున్న ముంబై పోలీసును చూపిస్తూ సరదాగా జోక్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే, ఈ పోస్టు ముంబై పోలీసులను అవమానించేలా ఉందంటూ ట్విట్టర్లో ఒక్కసారిగా విమర్శలు వెల్లువెత్తాయి. ఇది అసలు ముంబై పోలీసు ఫోటోనే కాదనీ కొందరు పేర్కొనగా.. భుజంపై ఉన్న బ్యాడ్జీ ఆధారంగా.. అది మధ్యప్రదేశ్ పోలీసు కావచ్చునంటూ మరికొందరు కామెంట్ చేశారు.

కాగా మరికొందరు నెటిజన్లు మాత్రం 'ముంబై పోలీసులు ఫిట్‌గా ఉండడానికి ప్రయత్నించాలి' అంటూ శోభాడేకు సానుకూలంగా స్పందించారు. అయితే ముంబై పోలీసులు మాత్రం శోభాడేకి సరైన సమాధానం ఇచ్చారు. ఒక బాధ్యత గల వ్యక్తిగా ఆమె నుంచి ఇలాంటివి వినాల్సి రావడం బాధాకరమని వారు ట్వీట్ చేశారు.

'శోభాడే అపహాస్యాలు కూడా మేము ఇష్టంగా స్వీకరించగలం కానీ, ఇది మాత్రం పూర్తిగా తప్పుడు సందేశం ఇచ్చేలా ఉంది. యూనిఫామ్‌గానీ, ఆ అధికారిగానీ మాకు సంబంధించిన వ్యక్తి కాదు. మీలాంటి బాధ్యతయుతమైన పౌరుల నుంచి ఇంకా మంచి విషయాలు రావాలని ఆశిస్తున్నాం' అని ముంబై పోలీసులు ట్విటర్లో గట్టి కౌంటర్ ఇచ్చారు. కాగా, పలువురు పోలీసుల ట్వీట్‌కు మద్దతుగా స్పందించారు.

English summary
Over the last year or so, the Mumbai Police has impressed social media users with their wit and humour on Twitter. However, columnist Shobhaa De found out about this the hard way after she attempted to body-shame Mumbai police personnel.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X