'వొడ్కాపై' ఆ హెచ్చరిక: గమనించలేదో.. ఇక అంతే సంగతి?

కెనడా: తినే లేదా తాగే ఆహార పదార్థాల విషయంలో కొన్నింటి పట్ల జాగ్రత్త వహించడం మంచిది. అందుకు అనుగుణంగా ఆయా సంస్థలు తమ ఉత్పత్తులపై స్టిక్కర్లు కూడా అతికిస్తుంటాయి. కానీ వాటిని చూడగానే కలిగే ఆతృతలో.. అవేవి పట్టించుకోకుండానే లాగించేస్తుంటారు కొంతమంది.

ఇలాంటి అత్యుత్సహామే ఓ వ్యక్తి కొంపముంచింది. ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాల్సిన పరిస్థితి కల్పించింది. కెనడాలోని సర్రే అనే ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

పూర్తి వివరాలను పరిశీలిస్తే.. సర్రేకు చెందిన ఎమ్మా మిరింగ్‌టన్‌(42) అనే మహిళ ఇటీవల ఓ ఫుడ్ ఫెస్టివల్ లో పాల్గొంది. గిల్డ్ ఫోర్డ్ చీజ్ అండ్ చిల్లీ అనే ఈ ఫెస్టివల్ లో రకరకాల మిరప ఉత్పత్తులు ప్రదర్శనకు ఉంచారు. ఇందులో భాగంగా ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ఘాటు కలిగిన కరోలినా రేపర్ రకానికి చెందిన మిరప ఆహార ఉత్పత్తులను కూడా ఏర్పాటు చేశారు.

 Surrey man drinks a shot of world's hottest chilli vodka and has to be taken to hospital

ప్రదర్శనకు వెళ్లిన ఎమ్మా మిరింగ్ టన్‌కు 'సతాన్స్ షాట్' అనే కరోలినా రేపర్ వొడ్కాపై మనసు గుంజింది. దాన్ని కొనుగోలు చేసి స్నేహితుల కోసం ఓ పార్టీ ఏర్పాటు చేసింది. పార్టీకి వచ్చిన మిత్రుల్లో ఒకరు.. బాటిల్ చూడగానే.. గటగటా కొంత వొడ్కాను తాగేశాడు.

అయితే ఆ తొందరలో బాటిల్ పై ఉన్న హెచ్చరికను అతను గమనించలేదు.' మీరు గనుక సతాన్ షాట్ తాగాలనుకుంటే.. నరకంలో మీరు దహించబోతున్నట్లుగానే ఉంటుంది' అని దానిపై రాసి ఉంది. ఈ వొడ్కా అత్యంత ఘాటుగా ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచించారు. కానీ అదేది పట్టించుకోకుండానే అతను లాగించడంతో.. ఆసుపత్రి పాలు కాక తప్పలేదు.

దాన్ని సేవించిన కొద్దిసేపటికే అతను అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దీంతో హుటాహుటిన అతన్ని ఆసుపత్రికి తరలించగా.. సతాన్స్ షాట్ వల్లే ఇలా జరిగిందని వైద్యులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+