దెయ్యాల ఊరిలో... 40 యేళ్ళు ఒంటరిగా...

ఎటు చూసినా తెల్లని మంచు... ఎముకలు కొరికేసే చలి.. పైగా అదో దెయ్యాల ఊరు...అన్నిటినీ మించి భయంకరమైన ఒంటరితనం... అలాంటి ప్రదేశంలోకి వెళ్ళాలంటేనే వణుకు పుడుతుంది ఎవరికైనా.

న్యూజెర్సీ: ఎటు చూసినా తెల్లని మంచు... ఎముకలు కొరికేసే చలి.. పైగా అదో దెయ్యాల ఊరు...అన్నిటినీ మించి భయంకరమైన ఒంటరితనం... అలాంటి ప్రదేశంలోకి వెళ్ళాలంటేనే వణుకు పుడుతుంది ఎవరికైనా.

కానీ అలాంటి నిర్జన ప్రదేశంలో ఓ వ్యక్తి 40 ఏళ్ళుగా జీవిస్తున్నాడు, నా అనే తోడు లేకుండా. పలకరించే తోడు కూడా లేకపోవడంతో అక్కడి ప్రకృతిని వీడియో తీస్తూ గడిపేస్తున్నాడు.

అతడి ఒంటరి జీవితం, అతడు తీసిన వీడియోలు.. ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ పరిస్థితులను అద్దం పడుతూ చేస్తున్న పరిశోధనలకు ఉపయోగపడుతున్నాయి. ఇది న్యూజెర్సీకి చెందిన బిల్లీ బర్(60) కథ.

దెయ్యాల ఊరిలో...

దెయ్యాల ఊరిలో...

ఎన్విరాన్ మెంటల్ సైన్స్ చదివిన ఇతడు 1972లో వాటర్ కెమిస్ట్రీ పరిశోధన నిమిత్తం రాకీ మంచు పర్వత ప్రాంతమైన కొలరాడోలోని గొతిక్ పట్టణానికి వెళ్ళాడు. ఆ పట్టణంలో 1920 నుంచి జనసంచారం లేదు.

దీంతో గొతిక్ పట్టణానికి 'దెయ్యాల ఊరు' అన్న పేరుపడిపోయింది. బిల్లీ బృందం ఆ పట్టణంలో పరిశోధనలు జరిపి తిరిగి వెళ్ళిపోయింది. అయితే బిల్లీకి ఆ గొతిక్ పట్టణం బాగా నచ్చింది.

ఒంటరిగా.. ఏ తోడూ లేకుండా...

ఒంటరిగా.. ఏ తోడూ లేకుండా...

నరమానవుల సంచారం లేకపోయినా సరే, తను మాత్రం అక్కడే జీవించాలని నిర్ణయించుకున్నాడు. ఇకేముంది, ఆలోచన రావడమే ఆలస్యం.. మూటా ముల్లె సర్దుకుని గొతిక్ పట్టణానికి చేరుకున్నాడు.

దట్టంగా మంచు కురిసే ఆ ప్రాంతంలో చిన్న టెంట్ ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ ఎముకలు కొరికే చలిలో కొన్ని గంటలు ఉన్నా మృత్యువాత పడడం ఖాయం. అయితే ఆ దెయ్యాల ఊరిలో భవనం కలిగిన ఓ వ్యక్తి బిల్లీని ఆ భవనంలో ఉండమన్నాడు.

ప్రకృతిని వీడియోలో బంధిస్తూ...

ప్రకృతిని వీడియోలో బంధిస్తూ...

దీంతో బిల్లీ ఒంటరిగా కొన్నేళ్ళపాటు ఆ భవనంలో నివసించాడు. సమీపంలోని మరో పట్టాణానికి వెళ్లి తనకు అవసరమైన సామగ్రి తెచ్చుకునే వాడు. ఒంటరిగా ఉండడం వల్ల బోర్ కొట్టి.. తన వద్దనున్న కెమెరాతో అక్కడి అందాలను, ప్రకృతిలో వచ్చే మార్పులను వీడియో తీయడం మొదలుపెట్టాడు.

పరిశోధనలకు ఆధారంగా...

పరిశోధనలకు ఆధారంగా...

మొదట్లో తానూ ఏ ఉద్దేశం లేకుండా వీడియోలు తీసినా.. ప్రస్తుతం తాను తీసిన వీడియోలు గ్లోబల్ వార్మింగ్ పరిశోధనలకు ఎంతగానో ఉపయోగ పడుతున్నాయని బిల్లీ అంటున్నాడు.

మంచు ఎంత దట్టంగా కురుస్తుంది? అక్కడ ఏ సమయంలో ఎంత ఉష్ణోగ్రత ఉంటుంది? మంచు సాంద్రత? .. ఇలా ప్రకృతిలోని ప్రతి విషయాన్నీ గత 40 ఏళ్లుగా బిల్లీ బర్ వీడియో తీస్తూనే ఉన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+