సర్వేలో షాకింగ్: మగాళ్ళను బెదిరించి మహిళల అత్యాచారాలు

మహిళలపై పురుషులు బలవంతంగా అత్యాచారానికి పాల్పడడం గురించి ప్రతిరోజూ వార్తలు చూసే వింటాం వినే ఉంటాం. అయితే పురుషులపై మహిళలు బలవంతంగా అత్యాచారాలకు పాల్పడుతున్నారు.

లండన్:మహిళలపై పురుషులు బలవంతంగా అత్యాచారానికి పాల్పడడం గురించి ప్రతిరోజూ వార్తలు చూసే వింటాం వినే ఉంటాం. అయితే పురుషులపై మహిళలు బలవంతంగా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. బెదిరించి, బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతూ మహిళలు పురుషులపై అత్యాచారాలకు పాల్పడుతున్నారని ఓ పరిశోధనలో తేలింది.

మహిళలపై పురుషులు అత్యాచారాలకు పాల్పడడం సహజంగా వినే ఉంటాం. కానీ, పురుషులనే బెదిరించి అత్యాచారాలకు పాల్పడడం వినడానికే వింతగా ఉంటుంది.

అయితే విదేశాల్లో మాత్రం ఈ తంతు విచ్చలవిడిగా సాగుతోందని తేలింది. ఈ మేరకు బ్రిటన్‌లో నిర్వహించిన పరిశోధన అనేక విషయాలను బట్టబయలు చేసింది.

అత్యాచారాలపై సర్వేలు నిర్వహించడం సాధారణమే. కానీ, మహిళలపై జరిగే అత్యాచారాలు పెరిగాయా, తగ్గాయా, ఏ రకమైన అత్యాచారాలు సాగుతున్నాయనే విషయాలపై పలు సర్వేలు నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా పురుషులపై మహిళల అత్యాచారాలపై సర్వే నిర్వహించారు. అయితే ఈ సర్వేలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి.

పురుషులపై మహిళల అత్యాచారాలు

పురుషులపై మహిళల అత్యాచారాలు

పురుషులపై మహిళలు అత్యాచారాలకు పాల్పడుతున్నారనే విషయాన్ని బ్రిటన్‌లోని ల్యాంకస్టెర్ యూనివర్శిటీ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ఈ తరహ సర్వే నిర్వహించడం ఇదే తొలిసారి.మహిళలపై పురుషులు బలవంతంగా శృంగారం చేస్తే రేప్ అంటారు. కానీ, పురుషులపై మహిళలు అత్యాచారానికి పాల్పడితే ఫోర్స్‌డ్ టూ పెనెట్రేట్‌ గా అభివర్ణిస్తోంది ఈ సర్వే.

బ్లాక్ మెయిల్ చేస్తూ పురుషులపై మహిళల అత్యాచారాలు

బ్లాక్ మెయిల్ చేస్తూ పురుషులపై మహిళల అత్యాచారాలు

బ్లాక్‌మెయిల్ చేస్తూ మరీ పురుషులపై మహిళలు అత్యాచారాలకు పాల్పడుతున్నారని బ్రిటన్ యూనివర్శిటీ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. బ్లాక్‌మెయిల్ చేయడం, బెదిరించడం, దూషించడం, వదంతులు ప్రచారం చేయడం, అనుబంధాల్లో చిచ్చు పెడతామని హెచ్చరిస్తూ పురుషులపై మహిళలు అత్యాచారాలకు పాల్పడుతున్నారు.

ఆయుధాలతో బెదిరించి అత్యాచారాలు

ఆయుధాలతో బెదిరించి అత్యాచారాలు

కొన్ని సందర్భాల్లో మహిళలు బలప్రయోగం చేసి ఆయుధాన్ని ఉపయోగించి మరీ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని యూనివర్శిటీ నివేదిక తెలిపింది. సమ్మతి లేకుండానే డ్రగ్స్ ఇవ్వడం కూడ ఇలాంటి వ్యూహల్లో భాగమని యూనివర్శిటీ పేర్కొంది. ఇలాంటి సందర్భాలను రేప్‌గా పరిగణిస్తారు. కానీ, బ్రిటన్ చట్టాలు మాత్రం ఇలాంటి ఘటనలను రేప్‌గా గుర్తించడం లేదని ఈ నివేదిక వెల్లడించింది.

ఈ ఘటనలన్నీ రహస్యంగానే

ఈ ఘటనలన్నీ రహస్యంగానే

సమ్మతి లేకుండానే పురుషులపై మహిళలు అత్యాచారానికి పాల్పడిన ఘటనలన్నీ రహస్యంగానే ఉండిపోతున్నాయి. పురుషుల కన్నా మహిళల శరీరాకృతి బలహీనంగా ఉంటుంది.కాబట్టి వారు బలప్రయోగం చేయలేరనేది అందరూ ఒప్పుకొనే వాస్తవం. మహిళలతో శృంగారం పురుషులు ఎల్లపుడూ అస్వాదిస్తారనే అపోహ కూడ ఇందుకు కారణమనే అభిప్రాయాలు కూడ ఉన్నాయి. దీంతో ఈ ఘటనలన్నీ కూడ రహస్యంగానే ఉండిపోతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+