అడ్డంగా బుక్కైన వీహెచ్: జగ్గారెడ్డికి బ్రాస్ లెట్!, అప్పట్లో రాజీవ్ దూకమంటే దూకేశారు..
సరే డ్యామేజీ ఎలాగు జరిగిపోయింది, దాన్ని పూరించడమెలా? అనుకున్నారో మరేమో గానీ.. శుక్రవారం సంగారెడ్డికి వెళ్లి మరీ.. తన చేతికి ఉన్న బ్రాస్ లెట్ ను జగ్గారెడ్డికి తొడిగి వచ్చారు వీహెచ్.
సంగారెడ్డి: రాహుల్ గాంధీ ప్రజాగర్జన సభలో గర్జించడానికి వెళ్లిన కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ నోట్లో పచ్చి వెలక్కాయ పడినంత పనైపోయింది. మైకు పట్టుకుని జగ్గారెడ్డిని తెగ స్తుతించిన వీహెచ్.. రాహుల్ అడిగిన ప్రశ్నకు అడ్డంగా బుక్కైపోయారు. చివరకు తన చేతికి ఉన్న బ్రాస్ లెట్‌ను జగ్గారెడ్డి చేతికి తొడగాల్సిన అనివార్య పరిస్థితిని ఎదుర్కొన్నారు.
నిజానికి వేదికపై వీహెచ్ ఆర్థిక అంశాలు లేవనెత్తకుండా ఉంటే ఇంత పని జరగకపోయేదేమో!. కానీ కోట్లు ఖర్చు పెట్టి జగమొండితనంతో జగ్గారెడ్డి అధికార పార్టీకి ఎదురు నిలుస్తున్నారని పొగుడుకొచ్చారు. సరిగ్గా ఇదే పాయింట్ పై ప్రశ్నించిన రాహుల్ గాంధీ.. జగ్గారెడ్డి అంత ఖర్చు పెడుతుంటే మీరేం చేస్తున్నారంటూ అడిగేసరికి వీహెచ్ నోట మాట రాలేదు.

కాగా, వీహెచ్ ఈ సభ కోసం వ్యక్తిగతంగా ఎలాంటి ఆర్థిక సహాయం చేయలేదట. వేదిక పైనే రాహుల్ అంత మాటనేసరికి పరువు పోయినట్లు ఫీలైపోయారు వీహెచ్. దానికి తోడు రాహుల్ మాటకు వేదిక మీద ఉన్నవారంతా ఒక్కసారిగా నవ్వడంతో ఆయనకు మరింత అవమానంగా అనిపించింది.
సరే డ్యామేజీ ఎలాగు జరిగిపోయింది, దాన్ని పూరించడమెలా? అనుకున్నారో మరేమో గానీ.. శుక్రవారం సంగారెడ్డికి వెళ్లి మరీ.. తన చేతికి ఉన్న బ్రాస్ లెట్ ను జగ్గారెడ్డికి తొడిగి వచ్చారు వీహెచ్. రాహుల్ గాంధీ అన్న మాటకు కట్టుబడి ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్వయంగా ఆయనే తెలిపారు.
రాజీవ్ దూకమంటే.. దూకేశా: వీహెచ్
ఇదే సందర్భంగా గతంలో కాంగ్రెస్ పార్టీ పట్ల తానెంత స్వామి భక్తి ప్రదర్శించానో చెప్పుకొచ్చారు వీహెచ్. ఒకానొక సమయంలో ఏపీలోని లంక గ్రామాల్లో రాజీవ్ గాంధీ పర్యటిస్తున్న సమయంలో ఆయన వెంట తాను వెళ్లానని గుర్తు చేసుకున్నారు. ఆ సందర్భంగా రాజీవ్..'నాకోసం ఏదైనా చేస్తానని తరుచూ చెబుతుంటావు కదా.. ఈ నదిలో దూకగలవా?' అంటూ ప్రశ్నించారని చెప్పారు. ఆయన అడగడమే ఆలస్యం.. వెంటనే తాను నదిలో దూకానని ఆయన నిబద్దత గురించి చెప్పుకొచ్చారు.
ఇక జగ్గారెడ్డికి బ్రాస్ లెట్ ఇవ్వడమనేది త్యాగపూరితం కాదని, ఇదొక మంచి సందేశం అని అన్నారు. కార్యకర్తలు, నాయకుల డిమాండ్ మేరకు రాహుల్ ను మెదక్ ఎంపీగా పోటీ చేయాలని కోరుతామన్నారు వీహెచ్. మొత్తానికి వీహెచ్ చేసిన జగ్గారెడ్డి భజన ఆయన చేతికి ఉన్న బ్రాస్‌లెట్‌కు ఎసరు పెట్టిందని జనం గుసగుసలాడుకుంటున్నారు.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications