రజనీకాంత్‌కు రాజకీయాలు అచ్చి రావా?

సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై ఇంకా ఊగిసలాట కొనసాగుతోంది. తన భవిష్యత్తు ఎలా ఉండనుందని రజనీకాంత్ జ్యోతిష్కులను ఆశ్రయించారు.

చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై ఇంకా ఊగిసలాట కొనసాగుతోంది. తన భవిష్యత్తు ఎలా ఉండనుందని రజనీకాంత్ జ్యోతిష్కులను ఆశ్రయించారు.

రాజకీయాల్లో రాణించగలుగుతానా, కింగ్ అవుతానా లేక కింగ్ మేకర్ అవుతానా అని తెలుసుకునేందుకు నలుగురు జ్యోతిష్కులతో వేర్వేరుగా మాట్లాడినట్లుగా ప్రచారం సాగుతోంది.

Will Rajinikanth has no future in Politics?

అభిమానుల కోరిక మేరకు రాజకీయాల్లోకి వస్తే రాణిస్తానా? నేను కింగ్ నవుతానా? కింగ్ మేకర్ గా మిగులుతానా? అసలు నాకు రాజకీయాలు సరిపడతాయా? అనే ప్రశ్నలను వారి ముందు ఉంచారని తెలుస్తోంది.

వీరిలో ముగ్గురు రజనీకి అనుకూల ఫలితాలు వస్తాయని చెప్పగా, ఒకరు మాత్రం రాజకీయాల జోలికి వద్దని, అవి అచ్చిరావని తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది.

రజనీ సంప్రదించిన జ్యోతిష్కుల్లో ఓ తెలుగు వ్యక్తితో పాటు కర్ణాటకకు చెందిన ఒకరు, తమిళనాడుకు చెందిన ఇద్దరు ఉన్నట్టుగా సమాచారం. రజనీ రాజకీయ ప్రవేశంపై ఇప్పటి వరకూ ఎటువంటి అధికారిక సమాచారమూ వెలువడలేదు.

ఇటీవల ఆయన తన అభిమానులతో సమావేశమైన సమయంలో యుద్ధం వస్తే చేసేందుకు సిద్ధమని వ్యాఖ్యానించడంతో ఆయన మనసులో రాజకీయ ప్రవేశంపై స్పష్టమైన ఉద్దేశంతోనే ఉన్నారని, సరైన సమయం కోసం వేచి చూస్తున్నారని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+