ఆంధ్ర యువకుడి మాట: "నేను ఐశ్వర్యారాయ్ కుమారుడ్ని'
హైదరాబాద్: బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్, అభిషేక్ బచన్ దంపతలకు ఆరాధ్య అనే ముద్దుల కూతురు ఉందనే విషయం మనందరికీ తెలుసు. అభిషేక్ బచన్ తన గారాలపట్టి ఆరాధ్య చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటారు.
Recommended Video

ఆరాధ్యతో తనకు ఆత్మ సంబంధం ఉందని ఐశ్వర్యా రాయ్ చెప్పినట్లు ఓ ప్రముఖ దిన పత్రిక కూడా రాసింది. అయితే, ఇప్పుడు ఆమెను వివాదంలోకి లాగారు. పింక్‌విల్లా రిపోర్టు ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు ఐశ్వర్యా రాయ్ తన తల్లి అని చెప్పుకుంటున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.

లండన్‌లో జన్మించానని
తాను 1988లో లండన్‌లో జన్మించానని, తనను ఐశ్వర్యా రాయ్ తల్లిదండ్రులు వృంద, కృష్ణా రాయ్ పెంచి పెద్ద చేశారని, తాను ఐవిఎఫ్ ద్వారా జన్మించానని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సంగీత్ కుమార్ అనే వ్యక్తి చెప్పుకుంటున్నాడని జాతీయ మీడియాలో వార్తకథనం వచ్చింది.

ఇలా విశాఖపట్నానికి వచ్చా...
సంగీత్ కుమార్ అనే యువకుడికి ఇప్పుడు 29 ఏళ్లు. తన తండ్రి తనను విశాఖపట్నం తీసుకుని వచ్చారని, అప్పటి నుంచి తాను ఇక్కడే ఉంటున్నానని అతను చెప్పుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి.

డాక్యుమెంట్స్ లేవని చెబుతున్నాడు...
తాను ఐశ్వర్యా రాయ్ కుమారుడిని అని నిరూపించడానికి తగిన పత్రాలు తన వద్ద లేవని, కీలకమైన డాక్యుమెంట్లను తన బంధువులు నాశనం చేశారని సంగీత్ కుమార్ అంటున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

మరి ఐశ్వర్యా రాయ్ ఏమంటారో...
సంగీత్ కుమార్ చెబుతున్న విషయంపై బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్ ఎలా స్పందిస్తారనేది చూడాల్సిందే. యువకుడు ఎందుకు అలా చెబుతున్నాడనేది తెలియదు. దాన్ని నమ్మడానికి ఏ మేరకు అవకాశం ఉందనేది కూడా తెలియదు.












Click it and Unblock the Notifications