పోర్న్‌స్టార్ ఎఫెక్ట్: ట్రంప్ సంసారంలో నిప్పులు.. హోటల్‌కు వెళ్లిపోయిన మెలానియా!

న్యూయార్క్: పోర్న్‌స్టార్‌తో సీక్రెట్ ఆఫైర్ వ్యవహారం చివరికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంసారంలో నిప్పులు పోసినట్లే కనిపిస్తోంది. ఎందుకంటే, ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పట్నించి ట్రంప్ భార్య మెలానియా ఆయనకు దూరంగా ఉంటున్నారు.

తన భర్త డొనాల్డ్ ట్రంప్ ప్రవర్తన పట్ల మెలానియా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ప్రస్తుతం ఆయనంటేనే అసహ్యించుకుంటున్నారని, ఈ నేపథ్యంలో ఆమె శ్వేతసౌధం వదిలిపెట్టి.. వాషింగ్టన్‌లోని ఓ హోటల్‌లో ఉంటున్నారని లోకమంతా కోడై కూస్తోంది.

ప్రస్తుతం ఇదే ‘హాట్ టాపిక్’...

ప్రస్తుతం ఇదే ‘హాట్ టాపిక్’...

అమెరికాలోని సోషల్ మీడియాలో ప్రస్తుతం ‘ట్రంప్ వర్సెస్ పోర్న్‌స్టార్' వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఎక్కడ చూసినా ఈ అంశంపైనే చర్చ జరుగుతోంది. మాజీ మోడల్, మూడో భార్య మెలానియాతో వివాహమైన ఏడాదికే 2006లో ట్రంప్ పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్‌‌తో ‘సీక్రెట్ అఫైర్' పెట్టుకున్నారని, ఓ గోల్ఫ్‌క్లబ్‌లో కలిసిన సదరు పోర్న్‌స్టార్‌ స్టన్నింగ్ బ్యూటీ చూసి అధ్యక్షులవారు ఫిదా అయిపోయారని, చివరికి ఆమెతో శ‌‌ృంగార కలాపాలు సాగించారని, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆయన పోటీ నేపథ్యంలో ఈ వ్యవహారం బయటికి పొక్కకుండా ఉండేందుకు పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్‌‌కు ట్రంప్ భారీగా డబ్బు ముట్టజెప్పారనే విషయం ఇటీవలే ‘ది వాల్‌స్ట్రీట్ జర్నల్' ప్రచురించిన కథనంలో వెలుగులోకి వచ్చింది. పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్ ఇంటర్వ్యూను 2011లో ప్రచురించిన ‘ఇన్ టచ్' అనే ఓ మ్యాగజైన్‌ను ఉటంకిస్తూ వాల్‌స్ట్రీట్ జర్నల్ ఈ కథనాన్ని రాసింది.

అక్రమ సంబంధం ఖరీదు ఎంతంటే...

అక్రమ సంబంధం ఖరీదు ఎంతంటే...

పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్ కనుక నోరువిప్పితే తన పరువుకు భంగం కలుగుతుందని భావించిన డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యవహారాన్ని సెటిల్ చేసేందుకు ఓ లాయర్ ద్వారా మధ్య వర్తిత్వం నెరిపారని, స్టార్మీ డేనియల్‌కు దాదాపు 1,30 ,000 డాలర్లు ముట్టజెప్పి.. ఆమె నోరు నొక్కేయించారని తెలుస్తోంది. అయినా సరే నిజం నిప్పులాంటిది కదా.. ఏదో ఒకరోజు అది బయటికి రాక మానదు. ఈ విషయం వెలుగులోకి రాగానే ఇటు ట్రంప్, అటు మధ్యవర్తిత్వం నెరిపిన లాయర్ ఇద్దరూ ఖండించారు, కొట్టిపారేశారు. కానీ అఫైర్‌ను సీక్రెట్‌గా ఉంచుతానని చెప్పిన పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్ మాత్రం ట్రంప్‌తో తనకున్న బంధాన్ని ఒప్పేసుకుంది. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీక్రెట్ అఫైర్ కాస్తా ‘ఫైర్' అయింది.

 ట్రంప్ సంసారంలో లుకలుకలు...

ట్రంప్ సంసారంలో లుకలుకలు...

తాను ఉండగానే తన భర్త మరో ఆడదానితో సంబంధం పెట్టుకుంటే ఏ ఆడది మాత్రం ఊరుకుంటుంది. ఎంత అమెరికా అధ్యక్షుడి భార్య అయినా తను కూడా ఓ ఆడదే కదా! అదే జరిగింది. డొనాల్డ్ ట్రంప్ సంసారంలో లుకలుకలు మొదలయ్యాయి. తన భర్త ‘పాడు పనులు' మెలానియాకు తీవ్ర ఆవేదన కలిగించాయి. దీంతో ట్రంప్‌పై మెలానియాకు ఆగ్రహం, అసహ్యం పెరిగిపోయాయి. అసలు ట్రంప్ అధ్యక్షుడై శ్వేతసౌధంలోకి అడుగుపెట్టిన తరువాత కూడా చాలాకాలం వరకు మెలానియా భర్త దగ్గరకే రాలేదు. ట్రంప్, మెలానియా అన్యోన్యంగా లేరంటూ అప్పట్లో కొన్నిరోజులు చర్చ కూడా జరిగింది. ఆ తరువాత ఒక శుభముహూర్తాన మెలానియా శ్వేతసౌధంలో అడుగుపెట్టి ఈ పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టింది. తీరా వచ్చాక ట్రంప్ ‘లీలలు' తరచూ బయటికొస్తుండడం మెలానియాలో తీవ్ర ఆవేదన కలిగించాయి.

అధ్యక్షుల వారూ ‘అలాంటి’ వారే...

అధ్యక్షుల వారూ ‘అలాంటి’ వారే...

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విచ్చలవిడితనంపై వార్తలు రావడం ఇదేం కొత్తకాదు. ఆయన విలాస జీవితం గురించే కాదు, శ‌ృంగార కలాపాల గురించి కూడా మీడియాలో వార్తలు హల్‌చల్ చేశాయి. గతంలో ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో.. ఒబామా, మిషెల్లీ దంపతులు ఏ హోటల్ గదిలో అయితే గడిపారో అదే హోటల్ గదిలో మన అభినవ మన్మధుడు ట్రంప్ వ్యభిచారిణులతో సాగించిన ‘గోల్డెన్ షవర్' దగ్గర్నించి.. స్నేహితుడి భార్యను పడగ్గదిలోకి ఆహ్వానించడంలో ఉండే థ్రిల్లే వేరు అంటూ అధ్యక్షులవారు చేసిన వ్యాఖ్యానాల వరకు.. అన్నీ ట్రంప్‌లోని లేకితనాన్ని బయట పెట్టాయి. చివరికి ఓ సందర్భంలో ట్రంప్ తన కుమార్తె ఇవాంకా గురించి కూడా అశ్లీలంగా కామెంట్ చేశారు. ఇవాంకా తన దృష్టిలో అద్భుతమైన అందగత్తె అని, తన కూతురు కాకపోయి ఉంటే ఆమెతో డేటింగ్‌ చేసే వాడినంటూ ఆయన చేసిన కామెంట్‌కు.. సాక్షాత్తు ఇంవాకాయే సిగ్గుపడిపోయి తలవాల్చేసింది.

 ట్రంప్‌ను వదిలేసి హోటల్‌కు...

ట్రంప్‌ను వదిలేసి హోటల్‌కు...

పాపం మెలానియా శ్వేతసౌధంలో అడుగుపెట్టిన దగ్గర్నించి తన భర్త, అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ ఎటు వెళ్లినా ఆయన పక్కనే ప్రత్యేక ఆకర్షణగా దర్శనమిచ్చేది. అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం రోజున భర్త తనను పట్టించుకోకపోయినా, పదుగురిలో కసురుకుని అవమానపరిచినా కళ్లల్లో తిరిగిన కన్నీటి సుడులకు అడ్డుకట్ట వేసి, పెదవులపై చిరునవ్వులు పూయించిందేకానీ ఎన్నడూ ట్రంప్‌ను పల్లెత్తు మాట అని ఎరుగదామె. అలాంటి ఫస్ట్‌లేడీకి కూడా తాజాగా భర్త ట్రంప్ గురించి బయటికొచ్చిన ‘సీక్రెట్ ఆఫైర్ విత్ పోర్న్‌స్టార్'.. ఫ్రస్టేషన్ కలిగించినట్లుంది. భర్త ట్రంప్‌పై ఆగ్రహం, అసహ్యంతో శ్వేతసౌధం నుంచి మెలానియా బయటికెళ్లిపోయిందని, ప్రస్తుతం ఆమె వాషింగ్టన్‌లోని ఓ హోటల్‌లో ఉంటోందని తాజా సమాచారం. పోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్‌తో తన భర్తకున్న అక్రమ సంబంధం విషయం వెలుగులోకి వచ్చినప్పట్నించీ ఆమెకు ఆయనతో సఖ్యత లేదని అంటున్నారు. అందుకే ఈ మధ్యన ట్రంప్ ఎక్కడికెళ్లినా పక్కన మెలానియా కనిపించడం లేదని, ఇటీవల దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు కూడా ఆమె ట్రంప్‌తో వెళ్లకపోవడాన్ని ఉదహరిస్తున్నారు విశ్లేషకులు. మొత్తంమీద ట్రంప్, మెలానియాలో అన్యోన్య దాంపత్య జీవితంలో పోర్న్‌స్టార్ నిప్పులు పోసిందనే చెప్పాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+