జంప్ చేసి కష్టాలు: ఎంపీ బుట్టా రేణుకకు పదవీ గండం?
న్యూఢిల్లీ: కర్నూలు లోకసభ సభ్యురాలు బుట్టా రేణుకు పదవీ గండం ఉందనే వార్తలు వస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి లోకసభకు గెలిచిన ఆమె ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
Recommended Video

అయితే, ఆమెకు కష్టాలు తప్పవని అంటున్నారు. ఎంపీగా ఉంటూ మరో లాభదాయక పదవిని అనుభవిస్తున్నారనే ఆరోపణలు ఆమెపై వచ్చాయి. పార్లమెంటరీ స్థాయి సంఘం కూడా ఆ విషయాన్ని నిర్ధారించినట్లు వార్తలు వచచ్చాయి.

అది ఇలా జరిగింది
కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలోని కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డు (సిఎస్‌డబ్ల్యుబీ) జనరల్ బాడీలో ఒక చైర్ పర్సన్, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, కేంద్ర ప్రభుత్వ అధికారులు ఉంటారు. వీరితో పాటు లోకసభ నుంచి బుట్టా రేణకను, రావత్‌లను కూడా నియమిస్తూ కేంద్ర మహిళా సంక్షేమ శా 2016 జులై 26వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసింది.

ఆ విషయం ఇలా తేలింది
అవి లాభదాయకమైన పదవులని పార్లమెంటరీ కమిటీ అధ్యయనంలో తేలింది. దీంతో బోర్డు సభ్యులుగా ఉన్న ఎంపీలపై అనర్హత వేటు వేయాలని సిఫార్సు చేసింది. దీనికి ముందు ఆ విషయంపై కేంద్ర న్యాయశాఖ అభిప్రాయాన్ని కూడా స్థాయీ సంఘం కోరింది. దీంతో బుట్టా రేణుక చిక్కుల్లో పడినట్లే.

ప్రభుత్వమే నియమించిందని...
ప్రభుత్వమే తమను బోర్డులో నియమించిందని, తాను గానీ, తన పార్టీ గానీ బోర్డులో నియమించాలని విజ్ఞప్తి చేయలేదని ఎంపీ బుట్టా రేణుక తమతో అన్నట్లు ఆంధ్రజ్యోతి దినపత్రిక రాసింది. తనపై అనర్హత వేటు వేసే అవకాశం ఉందని కమిటీ చేసిన సిఫార్సు గురించి తనకు తెలయదని ఆె అన్నారు.

అలా జరుగుతుందని...
మామూలుగా ప్రతి బోర్డులోనూ ఇద్దరు ఎంపీలను ప్రభుత్వమే నియమిస్తుందని, బర్డు జీతభత్యాలు ఏమీ చెల్లించదని, గతంలో తనను జట్ బోర్డులో నియమించారని బుట్టా రేణుక అన్నారు. ఇటీవలల ఆరోగ్య శాఖ బోర్డులో సభ్యురాలిగా నియమించిందని అన్నారు. ప్రస్తుతం సభ్యురాలిగా ఉన్న సిఎస్‌డబ్ల్యూబీ నుంచి తొలగించి కొత్త బోర్డులో నియమించారా, రెండింటిలోనూ కొనసాగుతున్నానా అనే విషంపై తనకు స్పష్టత లేదని అన్నారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications