అన్నదమ్ముల సవాల్: చిరంజీవి వర్సెస్ పవన్ కల్యాణ్
హైదరాబాద్: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సినీ ప్రముఖులు ప్రచార రంగంలోకి దిగే అవకాశం ఉంది. వివిధ పార్టీలు సినీ ప్రముఖుల కోసం ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఇందులో భాగంగా తెలుగు సినీ అన్నదమ్ములు చిరంజీవి, పవన్ కల్యాణ్ కూడా రంగంలోకి దిగే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది.
Recommended Video

పవన్ కల్యాణ్, చిరంజీవి వేర్వేరు పార్టీలకు ప్రచారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పవన్ కల్యాణ్ సొంత పార్టీ జనసేనను స్థాపించగా, చిరంజీవి ప్రస్తుతం కాంగ్రెసులో ఉన్న విషయం తెలిసిందే.

జెడిఎస్‌కు పవన్ కల్యాణ్
జెడిఎస్ పార్టీ విజయం కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ కర్ణాటక ఎన్నికల్లో ప్రచారం చేయనున్నారు. జెడిఎస్ అధ్యక్షుడు హెచ్. డి. కుమార స్వామి ఇదివరకే ఆ విషయాన్ని ప్రకటించారు. తమకు మద్దతుగా పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తారని ఆయన మీడియాకు ఇది వరకే చెప్పారు.

చిరంజీవి కోసం కాంగ్రెసు యత్నాలు...
కర్ణాటకలో ప్రచారానికి మెగాస్టార్, పార్లమెంటు సభ్యుడు చిరంజీవిని రంగంలోకి దింపాలనే యోచనలో కాంగ్రెసు పార్టీ ఉంది. కాంగ్రెసు నేతలు ఇందుకు అవసరమైన వ్యూహరచన చేస్తున్నారు. ఆ బాధ్యతను మాజీ మంత్రి, కన్నడ రెబల్ స్టార్ అంబరీష్‌కు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆ బాధ్యతను అప్పగించారని సమాచారం.

సిద్ధూకు అంబరీష్ హమీ...
చిరంజీవిని తీసుకుని వచ్చి ప్రచారం చేయిస్తానని అంబరీష్ సిద్ధరామయ్యకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తెలుగువారు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో చిరంజీవి చేత ప్రచారం చేయిస్తానని ఆయన హామీ ఇచ్చారని తెలుస్తోంది.

ఈ నియోజకవర్గాల్లో వారిద్దరు...
కర్ణాటకలోని బెంగళూరులోనే కాకుండా కోలారు, చిక్‌బళ్లాపురం, రాయచూరు ప్రాంతాల్లో తెలుగువాళ్లు ఉన్నారు. 2013లో ఎన్నికల్లో చిరంజీవి కాంగ్రెసు పార్టీ కోసం ప్రచారం చేశారు. ఇప్పుడు వేర్వేరు పార్టీల తరఫున పవన్ కల్యాణ్, చిరంజీవి ప్రచారం చేస్తే ఎలా ఉంటుందనే ఆసక్తి నెలకొని ఉంది.












Click it and Unblock the Notifications