అదే జరిగితే.. టీడీపీలో మరో సంచలనమే: 'కల్యాణ్ రామ్' అనూహ్య నిర్ణయం తీసుకోబోతున్నారా?
Recommended Video

హైదరాబాద్: తెలుగునాట ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ అప్పట్లో ఓ సంచలనం. కేవలం నెలల వయసున్న పార్టీతో.. ఏళ్లుగా పాతుకుపోయిన కాంగ్రెస్ పార్టీని ఆయన ఓడించగలిగారు. కానీ ఆ తర్వాతి రోజుల్లో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలు ఆయన ప్రభను తగ్గిస్తూ వచ్చాయి.
క్రమంగా పార్టీ సైతం చంద్రబాబు చేతుల్లోకి వెళ్లిపోయింది. తెలుగుదేశం భవిష్యత్తు వారసుడిగా అడపాదడపా జూ.ఎన్టీఆర్ వినిపిస్తూ వస్తున్నా.. ఇప్పట్లో ఆయన రాజకీయాల వైపు చూసే అవకాశం లేదు. కానీ జూ.ఎన్టీఆర్ అన్న కల్యాణ్ రామ్ మాత్రం ఆ దిశగా అడుగులు వేస్తున్నారా? అన్న ప్రశ్నలు మొదలయ్యాయి.

'ఎమ్మెల్యే' సినిమాతో మొదలైన ప్రచారం..:
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ఎమ్మెల్యే' ఆయన పొలిటికల్ ఎంట్రీపై ఊహాగానాలకు తావిచ్చింది. 'నేనింకా రాజకీయం మొదలుపెట్టనే లేదు.. మొదలుపెడితే చేయడానికి మీకేమి మిగలదు' అంటూ ఆయన చెప్పిన డైలాగ్.. రాజకీయాలపై పరోక్షంగా ఆయన ఆసక్తిని తెలియజేసిందా? అన్న చర్చ జరుగుతోంది.

పోసాని కామెంట్స్..:
ఎమ్మెల్యే ఆడియో ఫంక్షన్ సందర్భంగా రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి సైతం కల్యాణ్ రామ్ రాజకీయాల్లోకి రావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. పైగా.. 'తెలుగుదేశం పార్టీ మీది.. రామారావు గారి కుటుంబం నుంచి నీలాంటి వాడు వస్తే ప్రజలు బాగుపడుతారు' అంటూ పోసాని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.

పరోక్షంగా చెప్పింది అదే..:
వైసీపీ పట్ల సానుభూతితో వ్యవహరించే పోసానికి ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ అంటే పూర్తిగా గిట్టదనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు.. పార్టీని నారా వారి చేతుల్లో నుంచి నందమూరి కుటుంబం తిరిగి చేజిక్కించుకోవాలని పరోక్షంగా చెప్పినట్టయింది.

భవిష్యత్తు వారసుడిగా..:
స్తుతం తెలుగుదేశం పరిస్థితి కూడా ఏమంత బాగా లేదనే చెప్పాలి. మరీ ముఖ్యంగా చంద్రబాబు తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసే నాయకుడెవరూ పార్టీలో కనిపించడం లేదు.
లోకేష్ ఉన్నా.. ఆయన నాయకత్వంపై అంతగా నమ్మకం లేదు. కాబట్టి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ పగ్గాలు మళ్లీ నందమూరి కుటుంబం చేతుల్లోకి వెళ్లే అవకాశాలను కొట్టిపారేయలేం. ఈ క్రమంలో జూ.ఎన్టీఆర్ లేదా కల్యాణ్ రామ్ పార్టీ పగ్గాల కోసం ప్రయత్నించవచ్చునన్న వాదన వినిపిస్తోంది.

కొట్టిపారేయడానికి లేదు..:
జకీయాలపై కల్యాణ్ రామ్ మనసులో ఏముందన్నది ఇంతవరకు బయటకు వ్యక్తం కాలేదు. అయితే భవిష్యత్తులో టీడీపీకి ఒక శూన్య స్థితి ఏర్పడితే.. అనివార్యంగానైనా జూ.ఎన్టీఆర్ లేదా కల్యాణ్ రామ్ లలో ఒకరు పార్టీ పగ్గాలు అందుకునే ప్రయత్నం చేయవచ్చు అంటున్నారు.
హీరోగా కల్యాణ్ రామ్ కెరీర్ గ్రాఫ్ కూడా అంతంత మాత్రంగానే ఉండటంతో.. రాజకీయాల్లోనూ ఆయన తన అదృష్టం పరీక్షించుకునే అవకాశం లేకపోలేదు అంటున్నారు పరిశీలకులు. తెలుగుదేశంలో అనూహ్య పరిణామాలు కూడా కొత్తేమి కాదు కాబట్టి.. ఆ కోణంలోనూ దీనికి ఎంతో కొంత ఆస్కారం లేకపోలేదు అంటున్నారు.
-
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి..












Click it and Unblock the Notifications