వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తండ్రి కోరికను తీర్చని శ్రీదేవి: దానికి ఆయనే కారణం

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: అతిలోక సుందరి శ్రీదేవికి కూడా తీరని కోరికలున్నాయి. ఎవరూ నమ్మలేరు, ఎవరూ ఆ దిశగా ఆలోచించలేదు గానీ శ్రీదేవి రాజకీయాల్లోకి రావాలని అనుకున్నారు.

ఓ వైపు హోటల్ వ్యాపారం, మరో వైపు రాజకీయాలను నడిపించాలని భావించిన శ్రీదేవి రాజకీయాల్లోకి ఎందుకు రాలేకపోయారో అర్థం కాదు. చాలా గ్యాప్ తర్వాత ఆమె మళ్లీ సినిమా రంగంలోకి వచ్చారు గానీ రాజకీయాల్లోకి రాలేదు.

శ్రీదేవి అప్పుడిలా చెప్పారు...

శ్రీదేవి అప్పుడిలా చెప్పారు...

శ్రీదేవి 1988లో ఓ ఆంగ్ల సినీ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో తన భవిష్యత్తు కార్యక్రమం గురించి వివరించారు. రెండు మూడేళ్లలో తాను రాజకీయాల్లో ప్రవేశిస్తానని ఆమె అప్పట్లో చెప్పారు.

ఎందుకని అడిగితే ఇలా...

ఎందుకని అడిగితే ఇలా...

రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనుకుంటున్నారని ప్రశ్నిస్తే తన తండ్రి కోరిక మేరకే అని శ్రీదేవి చెప్పారు. తల్లిదండ్రులు ఎది కోరుకుంటే అది చేస్తానని ఆమె అన్నారు. తల్లిదండ్రులు అనుభవజ్ఞులని, తనకన్నా ఎక్కవ విషయాలు వారికి తెలుసు కాబట్టి అన్నింటికీ వారిపై ఆధారపడుతానని చెప్పారు.

తండ్రినే అడుగుతానని....

తండ్రినే అడుగుతానని....

ఎన్నికల్లో విజయం సాధిస్తే ఏం చేయాలో తన తండ్రినే సలహా అడుగుతానని శ్రీదేవి చెప్పారు. రాజకీయాల్లో నాయకులందరికీ సలహాదారులు ఉంటారు కదా, అందుకే తాను తండ్రిని సలహాదారుగా పెట్టుకుంటున్నానని అన్నారు. మన దేశంలో పేదలు, ధనికుల మధ్య న్న తేడాలను సరిచేసి, అందరూ సమానం కావాలనేది తన ఆకాంక్ష అని చెప్పారు. అయితే శ్రీదేవి తన తండ్రి కోరికను నెరవేర్చలేకపోయారు.

సినీ ప్రవేశం ఆయన వల్లనే...

సినీ ప్రవేశం ఆయన వల్లనే...

శ్రీదేవి సినీ రంగ ప్రవేశం చేయాడానికి తమళనాడు దివంగత ముఖ్యమంత్రి కామరాజ్ నాడార్ కారణం. శ్రీదేవి తండ్రి అయ్యప్పన్, ఆయన మిత్రుడు బాలు నాయక్కర్ కాంగ్రెసు పార్టీ సభ్యులు. ఓ రోజు నాలుగేళ్ల శ్రీదేవిని ఆమె తండ్రి కామరాజ నాడార్ వద్దకు తీసుకుని వెళ్లారు. ఈ అమ్మాయి సినిమాల్లో నటిస్తే బాగుంటుంద కామరాజ్ అన్ారు.

 ఆయన ఇలా చేశారు...

ఆయన ఇలా చేశారు...

తమిళ సినీ గేయ రచయిత కన్నదాసన్‌కు కబురు చేసి సిఫార్సు చేయాలని కామరాజ్ చెప్పారు. ఆయన శ్రీదేవిని నిర్మాత చిన్నప్ప దేవర్‌కు పరిచయం చేశారు. చిన్నప్ప దేవర్ తాను తీస్తున్న తునైవన్ చిత్రంలో బాల కుమారస్వామి (మురుగన్) పాత్రలో నటించేందుకు బాలిక కోసం అన్వేషిస్తున్న ఆయన శ్రీదేవిని చూడగానే ఎంపిక చేసుకున్నారు.

English summary
Actress Sridevi has wanted to enter into politics to fullfil her father' wish.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X