నటి సమంతకు కేటీఆర్ బంపరాఫర్: రాజకీయాల్లోకి నాగార్జున కోడలు!?
Recommended Video

హైదరాబాద్: ఇటీవల సినిమా తారలు రాజకీయాల్లోకి చాలామంది వస్తున్నారు. దక్షిదిన అయితే ఇటీవలి కాలంలో పవన్ కళ్యాణ్, రజనీకాంత్, కమల్ హాసన్‌ల పేర్లు బాగా వినిపిస్తున్నాయి. మరికొందరు ఆయా రాజకీయ పార్టీలకు మద్దతుగా లేదా వ్యతిరేకంగా కనిపిస్తుంటారు. వారు క్రియాశీలక రాజకీయాల్లో కనిపించారు.
టాలీవుడ్ అందగాడు నాగార్జున రాజకీయాల్లో లేరు. కానీ 2014 ఎన్నికలకు ముందు గుజరాత్‌కు వెళ్లడం, అంతకుముందు వైయస్ రాజశేఖర రెడ్డితో చనువు, ఇటీవల కేసీఆర్ - కేటీఆర్‌లతో మంచి సంబంధాలు ఉన్నాయనే వాదనలు ఉన్నాయి. నాగార్జున పేరు ఈ విధంగా ఎక్కువగా వినిపిస్తుంటుంది.

సమంత పొలిటికల్ ఎంట్రీ అంటూ
రాజకీయాల్లోకి జయసుధ, జయప్రద వంటి నటీమణులు వచ్చారు. వాణివిశ్వనాథ్ కూడా రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆమె టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా, మరో ఆసక్తికరమైన ప్రచారం సాగుతోంది. ఇది నటి సమంత గురించి. ఇందులో వాస్తవం ఎంతో తెలియదు కానీ, ఆమె కూడా రాజకీయాల్లోకి రావొచ్చునని వార్తలు వస్తున్నాయి. అయితే ఇదంతా వట్టిదేనని చాలామంది భావిస్తున్నారు.

నిన్న జయసుధ, రేపు సమంత?
అంతేకాదు, సమంత ఎక్కడి నుంచి పోటీ చేస్తుందనేది కూడా పేర్కొంటున్నారు. సమంత సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేయబోతున్నారని పేర్కొంటున్నారు. సికింద్రాబాద్ నియోజకర్గంలో క్రైస్తవ ఓటర్లు ఎక్కువ. అందుకే 2009లో కాంగ్రెస్ జయసుధను అక్కడి నుంచి పోటీ చేయించారు. ఇప్పుడు కౌంటర్‌గా టీఆర్ఎస్ సమంతను తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోందని వార్తలు రావడం గమనార్హం. ఇప్పటికే జయసుధ రాజకీయాలపై అనాసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు దాదాపు లేవు.

కేటీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారంటూ
నాగార్జునకు కేసీఆర్ కుటుంబంతో మంచి సంబంధాలు ఉన్నాయని అంటారు. ఈ కారణంగా మంత్రి కేటీ రామారావు.. సమంతతో పోటీ చేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట.

సికింద్రాబాద్ పైన ఇవీ లెక్కలు అంటూ
గతంలో కాంగ్రెస్ పార్టీ జయసుధను రంగంలోకి దింపి ఈ సీటును కైవసం చేసుకుందని, ఇప్పుడు టీఆర్ఎస్, కేటీఆర్ కూడా అదే దారిలో సమంతను పోటీ చేయించాలని భావిస్తున్నారని ప్రచారం సాగుతోంది. సమంత స్టార్ ఇమేజ్, క్రైస్తవ ఓట్లు, సీమాంధ్ర ఓట్లు.. ఇలా అన్నీ కలిసి వస్తాయని లెక్కలు కూడా చెబుతున్నారు.

అంతా వట్టిదేనా?
అందుకే సమంతకు తెలంగాణ తరఫు నుంచి గౌరవ మర్యాదలు అందుతున్నాయని కూడా పేర్కొంటున్నారు. అయితే, సమంత రాజకీయ ఆరంగేట్రం ప్రచారం అంతా వట్టిదే కావొచ్చుననే వారూ లేకపోలేదు. సమంత విషయాన్ని పక్కన పెట్టినా అక్కినేని కుటుంబం అందరితోను బాగుంటుంది. కాబట్టి ఓ పార్టీ వారిగా ముద్రపడే అవకాశం ఇవ్వరని అంటున్నారు.
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై












Click it and Unblock the Notifications