చలికాలంలో గీజర్ వాటర్ తో స్నానం చేసే వారికి అలెర్ట్!
చలికాలం.. వణికే చలిలో మనం వేడినీళ్ళ స్నానం చెయ్యాలని అందరం భావిస్తాం.. ఒకప్పుడు వేడి నీళ్లు కావాలంటే గ్యాస్ మీద, కట్టెల పొయ్యి మీద కాచుకొని ఆ నీళ్ళతో స్నానం చేసేవారు. కానీ ఈ రోజుల్లో ఎలక్ట్రిక్ హీటర్లు. గీజర్ల వాడకం విపరీతంగా పెరిగింది. అయితే ఈ సమయంలో గీజర్ లు వాడుతున్న వారు అనేక కీలక విషయాలను తెలుసుకోవాలి.
గీజర్ వాడే సమయంలో జాగ్రత్త
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఆరోగ్యం కోసమే కాదు రక్షణ కోసం కూడా గీజర్ వాడే వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. గీజర్లు వాడే క్రమంలో అనేక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది, కనుక వేడినీళ్ళ స్నానం చెయ్యాలని భావించిన వారు గీజర్ వేసి నీళ్ళు వేడి అయిన తర్వాత గీజర్ ఆఫ్ చేసి అప్పుడే స్నానం చెయ్యాలి. ఎందుకంటే ఒక్కోసారి గీజర్ నీటి గుండా కరెంట్ వచ్చే అవకాశం ఉంటుంది.

గీజర్ లు పేలిపోయే ప్రమాదం.. ఇవి గమనించండి
అలాంటప్పుడు కరెంట్ షాక్ కు గురయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాదు గీజర్ లు వినియోగించే వాళ్ళు ఎక్కడా లీకేజీలు లేకుండా చూసుకోవాలి, ఎక్కడైనా గీజర్ లు లీకేజ్ ఉంటే వాటిలోని బాయిలర్ మీద ఒత్తిడి పడి గీజర్ పేలిపోయే అవకాశం ఉంటుంది. కనుక జాగ్రత్తగా ఉండాలి. కనుక గీజర్ నీళ్ళతో స్నానం చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి.
సలసలా కాగే గీజర్ నీళ్ళతో జుట్టు ఊడటం ఖాయం
ఇక గీజర్ వాటర్ తో స్నానం చేసే సమయంలో వాటర్ టెంపరేచర్ బాగా ఎక్కువ లేకుండా చూసుకోవాలి. బాగా కాలుతున్న నీళ్ళను పోసుకుంటే తప్పకుండా జుట్టు ఊడిపోతుంది. మన చర్మం కూడా పగిలినట్టు మారుతుంది. సలసలా కాగే నీళ్ళు అసలు తల మీద కానీ, ఒంటి మీద కానీ పోసుకోకూడదు. ఎప్పుడు స్నానం చేసినా గోరువెచ్చని నీళ్ళతోనే స్నానం చెయ్యాలి.
బాగా కాగిన గీజర్ వాటర్ తో చర్మానికి హాని
ఇక చలికాలంలో చలి బాధ నుండి ఉపశమనం కోసం చాలా మంది బాగా వేడి నీళ్ళను ఎక్కువసేపు స్నానం చేస్తారు. ఎక్కువ సేపు స్నానం చేయటానికి సమయం కేటాయిస్తారు. అయితే ఇది మంచిది కాదు. ఇలా చేస్తే మన చర్మానికి హాని కలుగుతుంది. చర్మం తన సహజ నూనెలను కోల్పోతుంది. దీని కారణంగా అనేక చర్మ వ్యాధులు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications