నిత్యం యవ్వనంగా, అందంగా ఉండాలంటే ఇవి గుప్పెడు తినండి
వయసు మీద పడుతుంటే ఎవరికి మాత్రం బాధగా ఉండదు చెప్పండి.. ముసలివాళ్లం అయిపోతున్నాం.. అందం తగ్గిపోతోందంటూ ఒకటే ఆందోళన చెందుతుంటారు. వయసు పెరగడం అనేది ప్రకృతి సహజంగా జరిగే ప్రక్రియ. అయినప్పటికీ నిత్యం యవ్వనంగా ఉండాలని, అందంగా ఉండాలని అందరూ కోరుకుంటుంటారు. అయితే ప్రస్తుత తరుణంలో జీవన విధానం పూర్తిగా మారిపోయింది. దీనికితోడు వాతావరణ కాలుష్యం తీవ్రంగా ఉంటోంది. ఇంట్లో నుంచి కాలు బయటకు పెడితే విపరీతమైన దుమ్ము, ధూళి. ఇటువంటి పరిస్థితుల మధ్య అందంగా కనపడాలని, నిత్యం యవ్వనంగా ఉండాలంటూ ఈ గింజలను కొంచెం రోజూ తింటుంటే చాలు.
విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది
విటమిన్ ఇ పుష్కలంగా ఉండే బాదంపప్పును ప్రతిరోజు తీసుకోవడంవల్ల జీర్ణ సమస్యల నుంచి బయటపడతారు. ప్రతిరోజు నానబెట్టిన బాదంపప్పు తింటే సులువుగా బరువు తగ్గుతారు. విటమిన్ ఇ మన శరీరాన్ని నునుపుగా ఉంచుతుంది. ఎండిపోనివ్వదు. చర్మాన్ని ఎప్పుడూ యవ్వనంగా ఉంచుతుంది. అందరికీ సహజంగా వస్తున్న రక్తపోటును అదుపులో ఉంచుకోవాలంటే ప్రతిరోజు గుప్పెడు బాదంపప్పు తినడం అంత మంచి మరొకటి లేదు. శరీరంలో ఉండే కొవ్వును నియంత్రణలో ఉంచడంతోపాటు అధిక కొవ్వును నియంత్రించడానికి కూడా ఉపయోగపడుతుంది. బాదంపప్పులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువకాలం జీవించాలనుకునేవారికి వరంలాంటివని చెప్పొచ్చు.

వృద్ధాప్యాన్ని తగ్గిస్తాయి
ఇవి వృద్ధాప్యాన్ని తగ్గిస్తాయి. అంతేకాదు కండరాల పెరుగుదలకు తోడ్పడుతుంది. వ్యాధినిరోధక శక్తి శరీరంలో పెరుగుతుంది. మధుమేహంతో బాధపడుతున్నవారికి రక్తంలో చక్కెర స్థాయులను తగ్గించడంలో, నియంత్రించడంలో ఇవి సహాయపడతాయి. ఇందులో ఉండే మెగ్నీషియం కూడా చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది. భోజనం చేసిన తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి బాదంపప్పు పనిచేస్తుంది. వీటిల్లో రాగి, విటమిన్ బి2, ఫాస్పరస్, బయోటిన్, జింక్, ఐరన్, ఫోలేట్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. పోషకాలు కావాలనుకునేవారు ప్రతిరోజు బాదంపప్పును తీసుకోవాలి.












Click it and Unblock the Notifications