షుగర్ కంట్రోల్ తో పాటు వేపాకులతో ఆరోగ్యంలో కలిగే మార్పులివే!

వేపాకులు మన ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఎన్నో రోగాల నుండి విముక్తి కోసం బాగా ఉపయోగపడతాయి. ఆయుర్వేదంలో వేపాకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. వేపాకుల్లో ఎన్నో అద్భుతమైన లక్షణాలు ఉంటాయి. వేపాకుల్లో వేపాకుల్లో యాంటి ఇన్‌ఫ్లమేటరీ, యాంటి అల్సర్‌, యాంటి మలేరియల్‌, యాంటి ఫంగల్‌, యాంటి హైపర్‌ గ్లైసెమిక్‌, యాంటి బ్యాక్టీరియల్‌, యాంటి వైరల్‌, యాంటి మ్యుటాజెనిక్‌, యాంటి కార్సినోజెనిక్‌, యాంటి ఆక్సిడెంట్‌ లక్షణాలు ఉంటాయి.

వేపాకుల రసంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
వేపాకులలో విటమిన్‌-ఎ, విటమిన్ - సి, కెరొటినాయిడ్స్‌, లినోలియిక్‌, ఒలియిక్‌ లాంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తాయి. ప్రతిరోజు వేపాకుల రసం తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అవేమిటే ప్రస్తుతం మనం తెలుసుకుందాం. వేపాకుల రసాన్ని ప్రతిరోజు తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు ఎన్నో రకాల అంటువ్యాధులు రాకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

Along with sugar control the changes in health with neem leaves

వేపాకులతో ఇన్ఫెక్షన్స్ కు చెక్
వేపాకులలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అంతేకాదు వేపాకులలో యాంటీ మైక్రో బయల్ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. వివిధ ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని వేపాకులు శరీరానికి అందిస్తాయి. ప్రతిరోజు వేపాకులను నమలడం వలన నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. నోరు శుభ్రంగా మారుతుంది. వేపాకులలో చేదు సమ్మేళనాలు ఉంటాయి. ఇవి రక్తంలోని టాక్సిన్స్ ను బయటకు పంపేందుకు ఎంతగానో సహాయపడతాయి.

వేపాకులతో డయాబెటిస్ కంట్రోల్
వేపాకులు రక్తాన్ని శుద్ధి చేస్తాయి. ఇన్ఫెక్షన్లతో బాధపడేవారు శరీరంలో ఇన్ఫెక్షన్ వచ్చినచోట వేపాకుల పేస్ట్ ను రాయడం ద్వారా త్వరగా అది నయం చేసుకోవచ్చు అని చెప్తారు. వేపాకుల రసాన్ని తాగినట్లయితే డయాబెటిస్ ను కంట్రోల్ చేయవచ్చు అంతేకాదు జీర్ణ క్రియ సవ్యంగా సాగేలా చూడవచ్చు. వేపాకుల కషాయాన్ని తీసుకుంటే రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గి డయాబెటిస్ కంట్రోల్ లోకి వస్తుంది.

చర్మ ఆరోగ్యానికే కాదు ఎన్నో ప్రయోజనాలను చేకూర్చే వేపాకులు
అనేక రకాల చర్మ సమస్యలను కూడా వేపాకు రసం నివారిస్తుంది. వేపాకులు మన గట్ హెల్త్ ను కాపాడుతాయి. మల బద్దకాన్ని నివారిస్తాయి. అలాగే మన కాలేయానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చే వేపాకు రసాన్ని తీసుకోవడం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కురిపిస్తుంది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+