జుట్టుకు కలర్స్ తెగ వెస్తున్నారా? హెయిర్ కలర్స్ తో ఏం జరుగుతుందంటే!
ప్రస్తుత మన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, కాలుష్యం వంటి వివిధ కారణాలు చిన్న వయసులోనే జుట్టు తెల్లబడిపోతున్న సమస్యతో చాలామంది బాధపడే పరిస్థితి తీసుకు వచ్చింది. ఇక తెల్ల జుట్టు సమస్యతో ఇబ్బంది పడుతున్న చాలామంది యూత్ రకరకాల హెయిర్ కలర్స్ వేసుకోవడానికి అలవాటు పడుతున్నారు. ఇక మార్కెట్లో యూత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని రకరకాల కంపెనీలు మంచి బ్రాండెడ్ హెయిర్ కలర్స్ ను తీసుకు వస్తున్నాయి.
హెయిర్ కలర్స్ తో రకరకాల సమస్యలు
యువతకు వారికి ఇష్టమైన రకరకాల కలర్స్ ను అందుబాటులోకి తెస్తున్నాయి. అయితే ఇలా జుట్టుకు రంగులు వేసుకుంటే చూడ్డానికి బానే ఉంటుంది అని యువత ఫీల్ అవుతున్నారు. కానీ తరచూ ఇలా రంగు వేసుకోవడం వల్ల చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక హెయిర్ కలర్ వేసుకోవడం వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయి అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

హెయిర్ కలర్స్ వేసుకుంటే జుట్టుకు ఇలా నష్టం
హెయిర్ కలర్ ఎక్కువగా వాడడం వల్ల జుట్టులో ఉండే న్యాచురల్ ఆయిల్స్ తొలగిపోతాయి. దీనివల్ల జుట్టు పొడిగాను, నిర్జీవంగాను తయారవుతుంది. అటువంటి పరిస్థితుల్లో జుట్టు పెరగదు. జుట్టు రాలిపోయే సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇక హెయిర్ కలర్స్ ఎక్కువగా వేసుకునే వారికి జుట్టుకు సంబంధించి క్యూటికల్స్ దెబ్బతింటాయి. జుట్టు సగంలో తెగిపోయే అవకాశం ఉంటుంది. జుట్టు నిర్జీవంగా మారిపోతుంది.
హెయిర్ కలర్స్ కెమికల్స్ తో అలెర్జీలు
మార్కెట్లో దొరికే రకరకాల హెయిర్ కలర్స్ లో కెమికల్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ కెమికల్స్ కొంతమంది శరీరానికి పడకపోవచ్చు దీనివల్ల వారికి చిరాకు, దురద, చర్మం ఎర్రగా మారడం, అలర్జీలు రావడం, వాపు రావడం వంటి సమస్యలు వస్తాయి. కనుక హెయిర్ కలర్స్ వేసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చర్మానికి సంబంధించిన ఏవైనా అలర్జీలు ఫీల్ అయితే వెంటనే డెర్మటాలజిస్ట్ ను సంప్రదించాలి.
హెయిర్ కలర్స్ తో క్యాన్సర్ ముప్పు
హెయిర్ కలర్స్ లో అమోనియా అనే కెమికల్ ను ఉపయోగిస్తారు. దీని వల్ల కొందరిలో శ్వాస తీసుకోవడం వల్ల ఇబ్బంది వంటి సమస్యలు వస్తాయి. ఇక అంతే కాదు దీర్ఘకాలంగా హెయిర్ కలర్లను వేసుకోవడం కారణంగా కొన్ని రకాల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హెయిర్ కలర్స్ ఉపయోగించేవారు ఈ విషయంలో ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి డెర్మటాలజిస్టుల సూచనల మేరకే హెయిర్ కలర్స్ ఉపయోగిస్తే మంచిదని చెబుతున్నారు.
disclaimer: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications