చలిగా ఉందని అతిగా కాఫీ తాగుతున్నారా? డేంజర్ జోన్లో పడ్డట్టే!
అసలే చలికాలం. చలి తీవ్రతను తట్టుకోవడానికి చాలామంది విపరీతంగా కాఫీలు, టీలు తాగుతూ ఉంటారు. వణికించే చలిలో వేడివేడిగా ఉండే కాఫీ తాగితే ఆ మజాయే వేరు అని ఫీల్ అవుతూ ఉంటారు. అయితే కాఫీ తాగడం కొంతమేరకు మంచిదే అయినప్పటికీ, అతిగా తాగితే మాత్రం అనారోగ్యాలకు కారణం అవుతుందని చెబుతున్నారు.
కాఫీ ఎక్కువ తాగితే ఏం జరుగుతుంది?
అధికంగా కాఫీ తాగితే ఎటువంటి అనారోగ్యాలు వస్తాయి శరీరంలో ఏం జరుగుతుంది అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం. అధికంగా కాఫీ తాగితే కొన్ని రకాల సమస్యలు శరీరంలో వస్తాయి. కాఫీ ఎక్కువగా తాగడం వల్ల ఎక్కువ సార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. దీనివల్ల శరీరం డిహైడ్రేట్ అవుతుంది. కాఫీ అధికంగా తాగే వారిలో ఛాతిలో మంట వంటి కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.

కాఫీ ఎక్కువ తాగితే దుష్ప్రభావాలు
అధికంగా కాఫీ తాగడం మన జీర్ణవ్యవస్థ పైన ప్రభావాన్ని చూపిస్తుంది. కాఫీలో ఉండే కెఫెన్ జీర్ణాశయంలో అధికంగా ఆమ్లాలు ఉత్పత్తి అయ్యేలా చేసి ఎసిడిటీ బారిన పడేస్తుంది. దీని కారణంగా ఛాతీలో అసౌకర్యం కలుగుతుంది. కెఫిన్ శరీరంలో అధికంగా చేరితే రక్తపోటు పెరిగే అవకాశం ఉంది. కాఫీ తాగే వారు అధికంగా తాగకుండా ఉంటేనే మంచిది.
హైబీపీ ఉన్నవారు ఎక్కువగా కాఫీ తాగుతున్నారా?
హై బీపీ ఉన్నవారు ఎక్కువసార్లు కాఫీ తాగితే రక్తపోటు సమస్య పెరిగి దాని కారణంగా శరీరం పైన ప్రతికూల ప్రభావాలు వస్తాయి. ఇక అంతే కాదు మనం తినే ఆహారంలోని కాల్షియాన్ని మన శరీరం గ్రహించకుండా కెఫిన్ అడ్డుకుంటుంది. కాఫీ తాగిన తర్వాత గంటలోనే రక్తంలో కెఫీన్, అధికంగా చేరుతుంది. ఆ తర్వాత ఆరు గంటల పాటు మన రక్తంలోనే కెఫిన్ స్థాయిలు ఉంటాయి.
కాఫీతో నిద్రలేమి సమస్య, డయాబెటిస్ రిస్క్
కాఫీ ని అధికంగా తాగడం వల్ల నిద్రలేమి సమస్య అంతేకాదు డయాబెటిస్ సమస్య కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రక్తంలో అధికంగా కెఫిన్ చేరకుండా ఉండాలంటే కాఫీని ఎక్కువ తాగకుండా ఉండాలి. ఎవరైనా కాఫీ తాగాలనుకుంటే రోజుకు రెండు కప్పుల కన్నా ఎక్కువ కాఫీ తాగకుండా ఉండడమే మంచిది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications