బిర్యానీలు తెగ తింటున్నారా? అయితే ఈ వార్త మీకోసమే!!

బిర్యానీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి .. మనలో ఎక్కువమంది బిర్యానీలు అంటే పడి చస్తారు. ఇక ఆదివారం వచ్చిందంటే బిర్యానీ చేసుకు తిందామని ఆలోచించేవాళ్లు మనలో చాలామంది ఉన్నారు. ఇక వీకెండ్ లో మూడు పూటలా బిర్యానీనే లాగించే వాళ్ళు మాత్రమే కాదు, వారంలో ఎప్పుడు పడితే అప్పుడు బిర్యానీలు తినేవారు మన సమాజంలో బాగా పెరిగిపోయారు.

బిర్యానీలు తినటం మంచిదేనా?
బిర్యానీలపై మన జనాలకు ఉన్న మోజు కారణంగానే పట్టణాల్లో గ్రామాల్లో ఎక్కడ చూసినా హోటల్ కంటే బిర్యానీ పాయింట్స్ ఎక్కువగా ఉంటున్నాయి. ముఖ్యంగా యువత బిర్యానీల కోసం హోటళ్ళు, రెస్టారెంట్ లకు పరుగులు పెడుతున్నారు. అయితే తరచూ బిర్యానీలు తినడం మంచిదేనా? ఊరికే బిర్యానీ తింటే ఎట్లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

are you eating biryani regularly know the disadvantages of frequent biryani eating

బిర్యానీలు ఎక్కువ తింటే ఊబకాయం
తరచూ బిర్యానీలు తినడం వల్ల చిన్నారులు, యువత కూడా ఊబకాయ బాధితులుగా మారుతున్నారు. ఎక్కువగా బిర్యానీలు తినే యూత్ కు అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. బిర్యానీలలో ఎక్కువగా వాడే మసాలాల కారణంగా కడుపులో అల్సర్ వచ్చే ప్రమాదం ఉందని, ఉదర సంబంధమైన సమస్యలకు బిర్యానీలు కారణమవుతాయని హెచ్చరిస్తున్నారు.

బిర్యానీలతో కొలెస్ట్రాల్, ట్రై గ్లిజరైడ్స్ సమస్యలు
ఇక బిర్యానీ లో ఉపయోగించే నూనె వాడకం మిగతా వంటలలో నూనె వాడకం కంటే ఎక్కువగా ఉండే కారణంగా మనిషి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. బిర్యానీ ల పేరుతో చికెన్, మటన్ తరచూ లాగిస్తే శరీరంలో కొవ్వు పేరుకుపోయే ప్రమాదం ఉందని, రక్తంలో ట్రై గ్లిజరైడ్స్ పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

గుండె జబ్బులకు బిర్యానీలతో చాన్స్
బిర్యానీలను ఇంట్లో చేసుకొని తిన్నా, బయట నుండి తెచ్చుకుని తిన్నా తరచూ తినడం ఏమాత్రం మంచిది కాదని వైద్యులు సలహా ఇస్తున్నారు. బయట రెస్టారెంట్లు, హోటల్స్ లో బిర్యాని తయారు చేయడానికి ఉపయోగించే నూనెలు ఉపయోగించే పదార్థాలు ఆరోగ్యకరమైనవి కావని, ఫలితంగా బిర్యానీలతో రోగాలను కొని తెచ్చుకోవడమే అవుతుందని చెబుతున్నారు. గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం తరచూ బిర్యానీలు తినే వారికి పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+