క్రిస్మస్, న్యూ ఇయర్ కేక్స్ తెగ లాగిస్తారా... అయితే ఇది మీ కోసమే!

క్రిస్మస్, న్యూ ఇయర్ అనగానే చాలామందికి ముందు గుర్తొచ్చేది కేక్స్. ఈ రెండు రోజులు విపరీతంగా అందరూ కేకులు తింటారు. ఇక ఈ రెండు రోజుల్లో మాత్రమే కాదు కొంతమంది తరచూ కేక్ తినడానికి ఇష్టపడతారు. అయితే కేక్స్ తినడం మంచిదేనా? కేక్ తినడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి? వంటి అనేక వివరాలను ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

కేక్స్ తింటున్నారా?
కేక్స్ ను తరచూ తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. కేక్స్ లో చక్కెర, నూనెలు అధికంగా ఉండడం వల్ల ఇవి మన శరీరానికి అధిక కేలరీలను అందిస్తాయి. వీటిని ఎక్కువగా తింటే శరీరంలో క్యాలరీలు పెరిగి బరువు పెరగడానికి దోహదం చేస్తుంది. తరచుగా కేక్స్ తినేవాళ్లు ఊబకాయ బాధితులుగా మారుతారు. అనేక ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది.

are you eating Christmas and New Year cakes know about health porblems over eating of cakes

కేక్స్ తింటే ఈ రోగాలు
కేక్స్ లో ఉండే చక్కెర కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. ఇవి మధుమేహం ఉన్నవారికి చాలా ప్రమాదకరంగా మారుతాయి. ఇక మధుమేహం లేని వాళ్ళని కూడా తరచూ కేక్స్ తినడం మధుమేహ బాధితులుగా చేసే ప్రమాదం ఉంటుంది. కేక్స్ లో ఉండే చక్కెర మన దంతాల ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తుంది. ఇవి దంతాలపైన ఫ్లాక్ ఏర్పడడానికి కారణం అవుతుంది.

కేక్స్ ఎక్కువ తింటే గుండె జబ్బులు కూడా
ఇది దంత క్షయానికి దారితీస్తుంది. కేక్స్ తిన్న తర్వాత నోటిని శుభ్రం చేసుకోకపోతే మన దంతాలు కచ్చితంగా పాడవుతాయి. ఇక కేక్స్ లో ఉండే కొవ్వుల కారణంగా మధుమేహం మాత్రమే కాదు గుండె జబ్బు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది, కేక్స్ లో ఉండే కొవ్వులు, ప్రాసెస్ చేసిన పిండి పదార్థాలు మన జీర్ణ సమస్యలకు కూడా కారణం అవుతాయి.

కేక్స్ తో మనకు పోషకాలు అందవు
కేక్స్ ఎక్కువగా తినేవారిలో అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. అంతేకాదు కొందరు కేక్స్ తింటే అలర్జీల బారిన కూడా పడుతూ ఉంటారు. కేక్స్ తరచూ తినడం ఏమాత్రం ఆరోగ్యం కాదు. ఇవి మన శరీరానికి కావలసిన పోషకాలను ఏమాత్రం అందించలేవు. అంతేకాదు కేక్స్ తినడం వల్ల శరీరానికే కాదు మానసిక ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడుతుంది.

తరచూ కేక్స్ తింటే మానసిక సమస్యలు
తరచూ కేక్స్ తినేవారిలో ఆందోళన, నిరాశ, మూడ్ స్వింగ్స్ వంటి మానసిక సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కేక్స్ మన శరీరానికి కావలసిన విటమిన్ లను, ఖనిజాలను అందించలేవు. ఎప్పుడో సరదాకి రుచి కోసం మాత్రమే తినాల్సిన కేక్స్ ను మనం తరచూ తింటే అది మనలను అనారోగ్యం పాలు చేస్తుంది. కనుక తస్మాత్ జాగ్రత్త.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+