ఖర్జూరపండ్లు తెగ తింటున్నారా? అయితే తెలుసుకోండి!
ఖర్జూర పండ్లు చాలా పోషకాలతో నిండిన పండ్లు. ఖర్జూర పండ్లను తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు దూరమై ఆరోగ్యంగా ఉంటామని చెబుతారు. అయితే అదే ఖర్జూర పండ్లను అతిగా తినడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు.
ఖర్జూరాల్లో ఫుల్ పోషకాలు
ఖర్జూర పండు పోషకాల గని. ఖర్జూర పండ్లలో ఫైబర్, పొటాషియం, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి . అయితే అతిగా తింటే మాత్రం ఖర్జూర పండ్లు మన శరీరానికి హాని కూడా చేస్తాయి. కనుక ఖర్జూర పండ్లు తినేవారు కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాలి.

షుగర్, ఒబేసిటీ ఉన్నవారు జాగ్రత్త
ఖర్జూర పండ్లు ఎక్కువగా తింటే మధుమేహం ఉన్నవారికి ఇబ్బంది వస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు బాగా తగ్గి హైపో గ్లైసిమియా వచ్చే ప్రమాదం ఉంటుంది. కనుక ఖర్జూర పండ్లను అతిగా తినకూడదు.ఇక ఊబకాయం ఉన్నవారు కూడా ఖర్జూర పండ్లను ఎక్కువగా తినకూడదు. వీరు పెద్ద మొత్తంలో ఖర్జూర పండ్లు తింటే బరువు మరింత పెరిగే ప్రమాదం ఉంటుంది.
ఈ సమస్యలు ఉన్నవారు ఖర్జూర పండ్లు ఎక్కువగా తినొద్దు
జీర్ణ సమస్యలతో బాధపడేవారు కూడా ఖర్జూర పండ్లను తక్కువ మొత్తంలోనే తీసుకోవాలి. అలా కాకుండా అతిగా తింటే ఖర్జూరాలు మన డైజేషన్ సిస్టం పాడుచేస్తాయి, ఖర్జూరాల్లో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. చాలామందికి ఖర్జూరాల వల్ల అలర్జీలు వచ్చే అవకాశం ఉంది. ఖర్జూరపండ్లను ఎక్కువగా తింటే చర్మం ఎర్రబడడం, దురద రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం వంటి సమస్యలు వస్తాయి.
ఖర్జూరాలతో దంతాలకు హాని
ఖర్జూరాలు ఎక్కువగా తినేవారిలో దంతాలు క్షీణించటం కూడా జరుగుతుంది. ఖర్జూరాలలో అధికంగా చక్కెర ఉండటం వల్ల అది దంతాలపైన ప్లాక్ గా పేరుకుపోతుంది. ఫలితంగా దంతాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇక ఇదే సమయంలో ఖర్జూరాలను ఎప్పుడు పడితే అప్పుడు తినడం మంచిది కాదు.
ఖర్జూరాలు తినేటప్పుడు ఇవి పాటించండి
ఖర్జూరాలు తినడానికి కూడా నిర్దిష్ట సమయం ఉంటుంది. ఉదయం ఖాళీ కడుపుతో ఖర్జూరాలు తింటే శరీరానికి శక్తి వస్తుంది. వ్యాయామం తర్వాత తింటే శక్తి స్థాయి పెరుగుతుంది. ఇక మధ్యాహ్నం మరియు రాత్రి భోజనానికి ముందు ఖర్జూరాలు తింటే ఆకలిని తగ్గిస్తుంది. కనుక ఈ అంశాలను గుర్తుపెట్టుకొని ఖర్జూర పండ్లను తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications