నెయ్యి తింటున్నారా? అయితే తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే!
చాలామంది నెయ్యిని ఆహారంలో భాగంగా చేసుకుంటారు. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని భోజనం చేస్తే ఆ మజాయే వేరు అని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. అంతే కాదు కొన్ని రకాల వంటకాలలో నెయ్యిని ఎక్కువగా ఉపయోగిస్తారు. నెయ్యిని ఎక్కువగా ఉపయోగించడం వల్ల వంటకాలు ప్రత్యేకమైన రుచిని సంతరించుకుంటాయి. అయితే మన నిజజీవితంలో ఆహారంలో నెయ్యిని వినియోగించడం మంచిదేనా? దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
నెయ్యితో గుండె ఆరోగ్యం
నెయ్యి మన రోజువారి ఆహారంలో తప్పనిసరిగా ఉండేలా చూసుకుంటే అది మన శరీరానికి కావలసిన అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. నెయ్యి మన గుండె ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడుతుంది. నెయ్యిలో కొవ్వు అధికంగా ఉన్నప్పటికీ నెయ్యిలో మోనో అన్సాచ్యురేటెడ్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఈ ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు మన గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి.

నెయ్యిలో పోషకాలు ఫుల్ ..
నెయ్యిలో విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ మరియు విటమిన్ కే ఉంటాయి. నెయ్యిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ప్రీ రాడికల్స్ వల్ల మన శరీరానికి కలిగే నష్టాలనుండి రక్షిస్తాయి. కొన్ని రకాల క్యాన్సర్లను రాకుండా చేస్తాయి. మన శరీరానికి కావలసిన పోషకాహార అవసరాలను తీర్చడంలోనూ, అనారోగ్యం నుండి రక్షించడంలోనూ నెయ్యి కీలక భూమిక పోషిస్తుంది. నెయ్యి మన బరువు తగ్గడానికి ఎంతగానో సహాయపడుతుంది.
బరువు తగ్గేందుకు నెయ్యి.. ఇంకా ఎన్నో లాభాలు
మన శరీరంలో వేగవంతమైన జీవక్రియ రేటును నెయ్యి ప్రోత్సహిస్తుంది. నెయ్యిలో కంజుకేటెడ్ లినోలెయిక్ యాసిడ్ అనే కొవ్వు ఆమ్లం ఉంటుంది. ఇది మన బరువు తగ్గడానికి ఎంతగానో దోహదం చేస్తుంది. అంతేకాదు నెయ్యి మన రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. మన చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. జుట్టు ఆరోగ్యాన్ని వృద్ధిచేసి, జుట్టు పెరుగుదలకు కూడా నెయ్యి తోడ్పడుతుంది.
నెయ్యితో ఈ ఆరోగ్య ప్రయోజనాలు కూడా
నెయ్యిని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మన జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. నెయ్యి పేగు ఆరోగ్యానికి మద్దతునిస్తుంది. నెయ్యి మన శరీరానికి కావలసిన శక్తిని పెంచుతుంది. మన కంటి చూపును మెరుగుపరుస్తుంది. నెయ్యిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది. రుతుక్రమ సమస్యలను నెయ్యి పరిష్కరిస్తుంది.
నెయ్యిలో ఆవు నెయ్యి చాలా శ్రేష్టం
నెయ్యిలో ఉండే న్యూట్రిషన్ వ్యాల్యూలు మన శరీరానికి కావలసిన పోషకాలను పుష్కలంగా అందించి మన శారీరక ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. అయితే నెయ్యిని ఆహారంలో భాగంగా చేసుకునేవారు గేదె పాల నుండి తీసిన నెయ్యి కంటే ఆవు నెయ్యిని ఉపయోగిస్తే చాలా మంచిది ఆవు నెయ్యి తింటే పైన పేర్కొన్న అన్ని ఆరోగ్య ప్రయోజనాలు కచ్చితంగా కలుగుతాయి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications