పచ్చిమాంసం ఫ్రిజ్ లో పెట్టి తర్వాత వండుకు తింటున్నారా? అయితే ఇది మీ కోసమే!

చాలామంది మాంసాన్ని ఇష్టంగా తింటారు. అయితే మాంసం తినేవారు పచ్చి మాంసం ఎక్కువగా ఉంటే దాన్ని ఫ్రిజ్లో పెట్టి మరుసటి రోజు వండుకొని తింటారు... ఇది మంచిదేనా? పచ్చి మాంసాన్ని ఎక్కువ రోజులు ఫ్రిజ్లో పెట్టి తినడం వల్ల ఏం జరుగుతుంది? దీంతో వచ్చే ఆరోగ్య సమస్యలేంటి? అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

ఫ్రిజ్ లో పెట్టి తినే మాంసంతో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్
పచ్చి మాంసాన్ని ఫ్రిజ్లో పెట్టి తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఫ్రిజ్లో నిలువ ఉంచే మాంసంపైన ఈకొలి అనే బాక్టీరియా అధికంగా చేరుతుంది. మహిళలు ఫ్రిజ్లో నుంచి మాంసాన్ని బయటకు తీసినప్పుడు ఆ బాక్టీరియా వారి చేతుల పైకి చేరి తరువాత చేతుల నుంచి ముక్కు ,నోరు ద్వారా కడుపులోకి ప్రవేశిస్తుంది. దీని కారణంగా మహిళలు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కు గురయ్యే అవకాశం ఉంది.

are you eating meat which is stored in the refrigerator But this is for you

పచ్చి మాంసం ఫ్రిజ్ లో నిలువ చేసేటప్పుడు జాగ్రత్త
ముఖ్యంగా మహిళలకు పచ్చి మాంసాన్ని ఫ్రిజ్లో నిలువ చేస్తే తినడం ఏమాత్రం మంచిది కాదు. పచ్చి మాంసాన్ని ఫ్రిజ్లో నిల్వ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలి. మాంసం షాప్ నుంచి తీసుకు వచ్చినప్పుడు కొంత వాటర్ లేదా బ్లడ్ లాంటిది ఉంటుంది. దానిని నేరుగా ఫ్రిజ్లో పెడితే అది ఫుడ్ పాయిజన్ కు కారణం అవుతుంది.

ఎక్కువ రోజులు మాంసం నిల్వ ఉంచింది తింటే జరిగేదిదే
అలా కాకుండా మాంసాన్ని శుభ్రంగా కడిగి అందులో ఉండే నీరంతా పోయేలాగా చేసి ఎటువంటి తడిదనము లేకుండా మాంసాన్ని బాక్సులో పెట్టి మూత పెట్టి స్టోర్ చేయాలి. ఇక మాంసాన్ని ఎక్కువ రోజులు ఫ్రిజ్లో ఉంచి తిన్నప్పటికీ అది ఫుడ్ పాయిజన్ గా మారుతుంది. ఎక్కువ రోజులు మాంసాన్ని ఫ్రిజ్లో నిల్వ ఉంచితే దాంట్లో చెడు బ్యాక్టీరియా తయారై అది మన జీర్ణవ్యవస్థకు, పేగులకు తీవ్రమైన హాని కలిగిస్తుంది.

ఫుడ్ పాయిజనింగ్ ఛాన్స్
ఫుడ్ పాయిజన్ అయితే కొందరికి వాంతులు, విరోచనాలు వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. దీంతో డిహైడ్రేషన్ ఎక్కువై తీవ్ర అస్వస్థతకు గురవుతారు. సాధ్యమైనంత వరకు మాంసాన్ని ఫ్రెష్ గా తింటేనే మంచిది. ఒకవేళ ఫ్రిజ్లో పెట్టాలి అని భావించిన ఎక్కువ రోజులు ఫ్రిజ్లో ఉంచితే ఏ మాత్రం మంచిది కాదు. దానిలో ఉండే పోషకాలు మొత్తం పోవడంతో పాటు అది ఫుడ్ పాయిజనింగ్ కు కారణం అవుతుంది. కాబట్టి మాంసాన్ని ఫ్రిజ్లో నిల్వ చేయాలి అనుకునేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+