బ్రేక్ ఫాస్ట్ లో పూరీ, వడ, గారెలు.. ఇలా ఆయిల్ ఫుడ్స్ తింటున్నారా? డేంజర్!

చాలామంది ఉదయం పూట రకరకాల అల్పాహారాలను తీసుకుంటూ ఉంటారు. అయితే ఉదయం అల్పాహారం తీసుకునేవారు ఆరోగ్యకరమైన అల్పాహారాన్ని తీసుకోవడం మంచిది. మన శరీరానికి కావలసిన పోషకాలను ఇచ్చేది. మన శరీర బరువు పెరగకుండా మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేది అయిన ఆహారాన్ని మాత్రమే అల్పాహారంగా తీసుకోవాలి.

ఉదయం అల్పాహారంలో ఇవి తినొద్దు
మనం తీసుకునే బ్రేక్ ఫాస్ట్ లో ప్రోటీన్లు, విటమిన్లు, పీచు పదార్థాలు, క్యాల్షియం తదితర అన్ని పోషకాలు ఉండేలా చూసుకోవాలి. అయితే ఈ విషయంలో చాలామంది శ్రద్ధ పెట్టడం లేదు. ఏది పడితే అది తింటూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. ఉదయం అల్పాహారంలో ఏది పడితే అది తినడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరీ ముఖ్యంగా బయట నుంచి తీసుకువచ్చిన అల్పాహారాన్ని తినడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు.

Are you eating oily foods like puri vada and bonda for breakfast Danger

ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఆయిల్ ఫుడ్ తింటే డేంజర్
చాలామంది తమ బ్రేక్ ఫాస్ట్ లో ఆయిల్ ఫుడ్స్ ను ఎక్కువగా తీసుకుంటారు. పూరి, వడ, బోండా ఇలా ఎక్కువ నూనెలో తయారు చేసిన వాటిని అల్పాహారంగా తింటూ ఉంటారు. ఉదయం పూట ఆయిల్ ఫుడ్స్ ని ఎక్కువగా తినడం వల్ల మన శరీర మెటబాలిజం తగ్గిపోతుంది. అంతేకాదు అది మన శరీరం పైన చాలా దారుణంగా పనిచేస్తుంది.

బయట ఆయిల్ ఫుడ్స్ తినొద్దు .. రీజన్ ఇదే
ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా తినేవారిలో శరీరం పనితీరు మందగిస్తుంది. బద్దకంగా అనిపిస్తుంది. శరీరం హెవీగా అనిపించడం మాత్రమే కాకుండా ఏ పని చేయాలన్నా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇక ఆయిల్ ఫుడ్స్ తినేవాళ్లు బయట ఫుడ్స్ తినడం మరింత డేంజర్. ఎందుకంటే బయట పూరి, బోండా, వడ తయారు చేసే ఆయిల్ ఒకసారి వాడిన తర్వాత పదే పదే ఉపయోగిస్తారు.

అనేక జబ్బులు వచ్చే ఛాన్స్
అటువంటి నూనెలతో చేసిన ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల హార్ట్ ఎటాక్స్, ఫ్యాటీ లివర్ సమస్య, షుగర్, క్యాన్సర్ వంటి అనేక జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయిల్ ఫుడ్స్ బయట తినడం అస్సలు మంచిది కాదు. ఇక బ్రేక్ ఫాస్ట్ లో తినడం ఏమాత్రం సూచించదగింది కాదు.

బ్రేక్ ఫాస్ట్ లో ఈ ఫుడ్స్ తో జాగ్రత్త
అప్పుడప్పుడు పూరి, బోండా, వడా లాంటివి తినవచ్చు, కానీ వాటిని ఇంట్లోనే ఫ్రెష్ ఆయిల్ తో తయారు చేసుకుని తింటే మంచిది. అలా కాకుండా బయట ఇష్టారాజ్యంగా తింటే మాత్రం ఖచ్చితంగా ఆసుపత్రిలో చేరాల్సి వస్తుంది. కనుక బ్రేక్ ఫాస్ట్ లో ఈ ఫుడ్స్ తో జాగ్రత్త.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+