రొయ్యలు తింటున్నారా? ఇవి తప్పక తెలుసుకోండి!
చాలామంది మాంసాహారాన్ని తెగ ఇష్టంగా తింటారు. మాంసాహారాన్ని మాత్రమే కాదు చేపలు, రొయ్యలు వంటి సీ ఫుడ్స్ ను కూడా బాగా ఇష్టంగా తింటారు. రొయ్యలు చాలా రుచిగానూ, మంచి పోషకాలతోనూ ఉండే ఆహారం. మాంసాహారాలన్నింటిలోకెల్లా రొయ్యలలో అతి తక్కువ క్యాలరీలు ఉంటాయి. రొయ్యలను తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
రొయ్యలలో ఫుల్ పోషకాలు
రొయ్యలలో ఆరోగ్యానికి మేలు చేసే బోలెడు పోషకాలు ఉంటాయి. జింక్ , అయోడిన్, విటమిన్ ఈ, విటమిన్ బీ 12, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. రొయ్యలలో ఉండే జింక్, అయోడిన్ వంటి ఖనిజాలు థైరాయిడ్ గ్రంధికి మేలు చేస్తాయి. కండరాలను బలోపేతం చేస్తాయి. కండరాల నిర్మాణానికి, జీవ క్రియ మెరుగుదలకు రొయ్యలు ఉపయోగపడతాయి. ఇన్ఫెక్షన్లు సోకకుండా మనల్ని కాపాడతాయి. రొయ్యలలో సెలీనియం ఉంటుంది. ఇది మన వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.

రొయ్యలతో ఈ రోగాలకు చెక్
రొయ్యలలో ఉండే సెలీనియం క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రొయ్యలలో అస్టాంక్సంతిన్ అనే ఖనిజం ఉంటుంది. ఇది గుండె జబ్బులతో పాటు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులను తగ్గిస్తుంది. రొయ్యలలో ఉండే పోషకాలు ఎముకలను దృఢంగా ఉంచడానికి సహాయపడతాయి. అలసటను దూరం చేస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి రొయ్యలు మంచి ఆహారంగా చెప్పొచ్చు. అల్జీమర్స్ వ్యాధితో బాధపడే వారికి రొయ్యలు మంచి ఆహారం అంటున్నారు.
రొయ్యలతో గుండె ఆరోగ్యం
రొయ్యలలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి ఇవి మన గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. రొయ్యలలో ఉండే ఐరన్ శరీరానికి ఆక్సిజన్ సరిగా సరఫరా చేయడానికి రక్తప్రసరణ మెరుగు చేయడానికి ఉపకరిస్తుంది. రొయ్యలలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను ఇవి తగ్గిస్తాయి.
రొయ్యలను వండే ముందు ఇలా చెయ్యండి
రక్త సరఫరాకు అడ్డుపడే కొవ్వును రొయ్యలు తొలగిస్తాయి. రక్త హీనత ఉన్నవారు రొయ్యలను తింటే రక్త హీనత సమస్య నుండి బయటపడతారు. కనుక రొయ్యలు ఒక మంచి పౌష్టికాహారం అనే విషయాన్ని తెలుసుకొని ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చే రొయ్యలను ఇష్టంగా తినేయండి. అయితే రొయ్యలను వండుకునే తినే విషయంలో ముందు రొయ్యలను తల తోకతో సహా ఒలిచి తీసేసి వాటిలో సిరలను తొలగించి వండుకోవాలి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications