పండ్లు తింటే ఆరోగ్యమని అతిగా తింటున్నారా? అయితే జాగ్రత్త!
చాలామంది పండ్లను ఇష్టంగా తింటారు. పండ్లు తింటే ఆరోగ్యంగా ఉంటామని భావించి ఉదయం, సాయంత్రం, రాత్రి వేళల్లో పండ్లను తమ ఆహారంలో భాగంగా చేసుకుంటున్నారు. అయితే పండ్లు తింటే ఆరోగ్యం వస్తుందన్నమాట వాస్తవమే అయినప్పటికీ అతిగా పండ్లు తినడం మాత్రం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. పండ్లను అతిగా తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
పండ్లు ఎక్కువ తింటే ఏమవుతుంది
పండ్లలో సహజంగానే చక్కెరలు, క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యంగా ఉంటామని భావించి వీటిని అతిగా తింటే బరువు పెరిగే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు విపరీతంగా పండ్లు తింటే పండ్లలో ఉండే చక్కెర శరీరంలో డయాబెటిస్ ను పెంచుతుందని డయాబెటిస్ బాధితులుగా మారే ప్రమాదం ఉంటుందని కూడా హెచ్చరిస్తున్నారు.

అతిగా పండ్లు తింటే ఈ అనారోగ్య సమస్యలు
చాలామంది అన్నం తినడం మానేసి పండ్లను ఎక్కువగా ఆహారంలో భాగంగా చేసుకుంటున్నారు. పండ్లలో చక్కెర, పీచు ఎక్కువగా ఉంటాయి. ఫలితంగా డయాబెటిస్ ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంటుందని జీర్ణ వ్యవస్థకు సంబంధించి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. కడుపు ఉబ్బరం, మలబద్ధకం, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు అందుకే పండ్లు తినాలి అనుకునేవారు రోజుకు ఎన్ని పండ్లు తినాలనేది కచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.
ప్రతీరోజూ ఇన్ని పండ్లు మాత్రమే తినాలి
పండ్లు ఇష్టంగా తినేవారు ప్రతిరోజు మూడు నుంచి నాలుగు మాత్రమే పండ్లు తినాలి. 500 గ్రాములలోపు పండ్లను మాత్రమే తినవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఇంతకంటే ఎక్కువ మొత్తంలో పండ్లను తీసుకుంటే ఆరోగ్యానికి ప్రమాదం వాటిల్లుతుందని హెచ్చరిస్తున్నారు. కనుక పండ్లు తినాలి అని భావించేవారు మితంగానే పండ్లు తినాలని గుర్తుంచుకోవాలి. ఇక పండ్ల జ్యూస్ లను చేసుకుని ఎక్కువగా తాగే వారు కూడా డయాబెటిస్ బాధితులుగా మారతారని హెచ్చరిస్తున్నారు.
పండ్ల జ్యూస్ లు ఎక్కువగా తాగితే మంచిది కాదు... జాగ్రత్త
పోషకాల పరంగా చూస్తే పండ్లను జ్యూస్ గా చేసి తాగడం వల్ల వాటిలో 60 శాతం యాంటీ ఆక్సిడెంట్లు తగ్గిపోతాయని ఇక పండ్లను జ్యూస్ గా చేసుకుని తాగే కంటే నేరుగా తినడం మంచిదని చెబుతున్నారు. కనుక పండ్లు అతిగా తినేవారు తప్పక మీ ఆలోచన మార్చుకోవాల్సిందే. అలా కాకుండా విపరీతంగా పండ్లను తింటే మాత్రం అనవసరమైన అనర్ధాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications