ఉదయం అల్పాహారం మానేస్తున్నారా? అయితే డేంజర్!
చాలామంది ఉదయం అల్పాహారం చెయ్యకుండా స్కిప్ చేస్తారు. అయితే బ్రేక్ ఫాస్ట్ మానేయడం ఏమాత్రం మంచిది కాదని చాలామంది చెబుతూ ఉంటారు. ఒక్క నెలరోజుల పాటు అల్పాహారం మానేస్తే ఏం జరుగుతుంది తెలిస్తే మీరు బ్రేక్ ఫాస్ట్ అసలు మానెయ్యరు. ఉదయం అల్పాహారం మానేయడం ఎంత డేంజర్ నో తెలుసుకుందాం.
అల్పాహారం మానేస్తే అనారోగ్యం
ఎవరైనా ఉదయం లేచిన తర్వాత తప్పనిసరిగా అల్పాహారం తీసుకోవాలి. అల్పాహారం చేయకపోతే అనేక ఇబ్బందులు వస్తాయి. ఉదయం అల్పాహారం తీసుకోకపోవడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు అందవు. అల్పాహారం తీసుకోకపోతే శరీరంలో రక్తంలో చెక్కెర స్థాయిలలో మార్పులు వస్తాయి. అల్పాహారం తీసుకుంటే శరీరానికి కావలసిన గ్లూకోజ్ అందుతుంది. రక్తంలో చక్కెర స్థాయి నిర్వహించబడుతుంది.

అల్పాహారం మానేస్తే మధుమేహం ముప్పు
ఎవరైతే ఉదయం అల్పాహారం మానేస్తారో వారి శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది. దీని కారణంగా టైప్ టు డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. శరీరానికి పోషకాలు అందకపోవడం వల్ల శరీరం రోగాలకు కేంద్రంగా మారుతుంది. కాబట్టి ప్రతీ ఒక్కరూ ఉదయం అల్పాహారం తీసుకోవడం మంచిది.
అల్పాహారం తీసుకోకుంటే రక్తపోటు
ఇక అల్పాహారం తీసుకోని వారిలో మెటబాలిక్ సిండ్రోమ్ ప్రమాదం పెరుగుతుంది. అల్పాహారం తీసుకోని వారు మధ్యాహ్న భోజనంలో ఎక్కువగా తింటారు. ఇది బరువు పెరగడానికి కారణం అవుతుంది. ఇది గుండెజబ్బులకు, గుండె ఆరోగ్యం మెరుగుపడాలంటే తప్పనిసరిగా అల్పాహారాన్ని తీసుకోవాలి. టైప్ టు డయాబెటిస్ కు, రక్తపోటుకు కారణం అవుతుంది.
అల్పాహారం తీసుకోకుంటే ఒబేసిటీ
మన శరీరంలో సెరటోనిన్ స్థాయిలు ఒక నెలరోజుల పాటు అల్పాహారాన్ని స్కిప్ చేస్తే దెబ్బ తింటాయి. చిరాకు, ఆందోళన, నిరాశ వంటి లక్షణాలు అల్పాహారం తీసుకోని వారిలో పెరుగుతాయి. దీని కారణంగా మానసికంగా తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది. అల్పాహారం తీసుకోకుండా దాటవేయడం కారణంగా బరువు తగ్గుతామని చాలామంది భావిస్తారు. అయితే దీనివల్ల అనారోగ్యకరమైన బరువు పెరిగే అవకాశం ఉంటుంది.
అల్పాహారం తీసుకోకుంటే జరిగేదిదే
ఉదయం అల్పాహారం తీసుకోని వారిలో రోగనిరోధక శక్తి గణనీయంగా తగ్గుతుంది. అల్సర్లు, గ్యాస్ సమస్యలు చోటు చేసుకుంటాయి. జీవక్రియ మందగిస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యలు కూడా పెరుగుతాయి. మైగ్రేన్ వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి అల్పాహారాన్ని మానివేయడం ఏమాత్రం మంచి కాదు. తప్పనిసరిగా ఉదయం అల్పాహారం తినాలి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications