రోజంతా ఏసీలో ఉంటున్నారా? అయితే ఈ జబ్బులకు మీరే బాధ్యులు!
ఎండాకాలం వచ్చేసింది. బయట తీవ్రమైన ఎండలు దాటికి బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్న వారు ఏసీ గదులకు పరిమితం అవుతున్నారు అయితే ఎక్కువగా ఏసిన వినియోగిస్తే అనారోగ్యాల బారిన పడటం ఖాయం అనే విషయాన్ని ఒకరు కచ్చితంగా తెలుసుకోవాలి. అసలు ఎక్కువగా ఏసీ ని ఉపయోగిస్తే వచ్చే దుష్ప్రభావాలు ఏమిటి? మన ఆరోగ్యం ఏవిధంగా పాడవుతుంది అనే విషయాలను ప్రస్తుతం తెలుసుకుందాం
ఏసీలో ఉంటే ఈ అనారోగ్యాలు
ప్రస్తుతం ఎండలు దంచికొడుతుండటంతో ప్రజలు ఉక్కపోతకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వారం రోజులనుండి వాతావరణంలో చోటుచేసుకుంటున్న పెనుమార్పులు కారణంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటటంతో ఒకసారిగా వాతావరణం హీటెక్కిపోతుంది. ఈ వాతావరణానికి తట్టుకోలేక ఏసీ గదుల్లోనే ఎక్కువగా గడుపుతున్నారు అలా రోజంతా ఏసీ గదుల్లో ఉండటం వలన ఆరోగ్య సమస్యలు అధికమవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. శ్వాస సంబంధిత వ్యాధులున్న వారికి , అస్తమా ,ఊబకాయం ఉన్నవారికి ఆరోగ్యం మరింతగా క్షీణిస్తుంది.

ఎక్కువసేపు ఏసీ గదుల్లో ఉంటే నరాల బలహీనత
ప్రతి మనిషి శరీరంలో మినిమం 20 డిగ్రీల వేడి వుంటుంది. సహజంగా వాతావరణంలో 20 డిగ్రీల నుండి 25 డిగ్రీలు ఉష్ణోగ్రత ఉంటే మనం తట్టుకోగలము .. అంటే మన శరీరానికి 20 డిగ్రీల ఉష్ణోగ్రతలు అవసరం అలా కాకుండా గదిలో ఎక్కువగా లేదా సాధారణంగా ఏసీ వేసుకొని నిద్రపోతే బాడీ ఎక్కువగా చల్లగా మారి కాళ్లు,చేతులు తిమ్మిర్లుగా మారే ఛాన్స్ ఉంటుంది.
ఏసీలో ఎక్కువ ఉంటే తలనొప్పి
ఎక్కువగా ఏసీ గదుల్లో ఉండటం వలన శరీరంలోని కండరాల పనితీరు తగ్గుతుంది. నరాలలో రక్త ప్రసరణ మందగిస్తుంది. కాబట్టి నరాలు బలహీనంగా మారుతాయి..
సాధారణంగా ఆరుబయట చలి గాలిలో తిరిగే వారికి రానటువంటి జబ్బులు ఏసీ గాలితో వెంటనే వచ్చేస్తాయి. తల తిప్పడం మొదలుకొని ,వాంతులు చేసుకునే వరకు వారిపై ఏసీ ప్రభావం చూపుతుంది . చాలా మందిలో తలనొప్పి మొదలౌతుంది.
ఏసీ ఎక్కువ వాడితే శరీరం డీ హైడ్రేషన్
కొంతమందిలో ఏసీ ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుంది. చర్మం పొడి పాడటం, చర్మం దురదగా మారడం వంటివి చోటు చేసుకుంటాయి. ఎక్కువసేపు ఏసీలో ఉంటే ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. అంతేకాదు ఏసీ గాలి వల్ల మెదడు కణాలు బలహీనపడి మెదడు సామర్థ్యం, పనితీరు దెబ్బతింటుంది.
కీళ్ళ నొప్పులు, కళ్ళపైన ఏసీ ప్రభావం
ఇక కీళ్ల నొప్పులు వంటి సమస్యలతో బాధపడేవారు ఏసీలో ఉండడం వల్ల బాడీ పెయిన్స్ తో పాటు కీళ్లనొప్పులు బాధిస్తాయి. ఏసీలో ఉంటే కీళ్ళ నొప్పుల సమస్య మరింత పెరుగుతుంది. ఏసీలో ఉండడం వల్ల కళ్ళు కూడా ప్రభావితమవుతాయి. కళ్ళు పొడిబారి ఇబ్బందికి గురవుతాయి. కనుక ఎండాకాలంలో ఏసీ వినియోగం ఎక్కువ మంచిది కాదు.












Click it and Unblock the Notifications