చన్నీళ్ళ స్నానం చేస్తున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి!
చాలామంది స్నానం చేయడానికి చన్నీళ్లు మంచిదా? వేడి నీళ్లు మంచిదా? అనేది తర్జనభజన పడుతూ ఉంటారు. ఇక వేసవికాలంలో రాత్రి వేళల్లో చాలామంది వేడి నుండి ఉపశమనం పొందడానికి చన్నీళ్ల స్నానం చేస్తారు. అసలు చన్నీటి స్నానం చేయడం మంచిదేనా? చన్నీటి స్నానం చేస్తే ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి? వంటి అనేక విషయాలను ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
చన్నీళ్ళ స్నానంతో వ్యాధి నిరోధక శక్తి పెంపు
రాత్రిపూట చన్నీటి స్నానం చేయడం వల్ల శరీరం రిలాక్స్ అవుతుంది. చన్నీళ్ళ స్నానం నిద్రను బాగా ప్రోత్సహిస్తుంది. ప్రతిరోజు చన్నీళ్ళతో స్నానం చేయడంవల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఇది ఒత్తిడిని బాగా తగ్గిస్తుంది. చన్నీళ్ల స్నానం మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని మరింత పెంచుతుంది. ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా మన శరీరాన్ని కాపాడుతుంది.

చన్నీళ్ళ స్నానంతో ఈ ప్రయోజనాలు
చన్నీళ్ళ స్నానం చేయటం వలన నాడీ వ్యవస్థ ఉత్తేజితం అవుతుంది. అంతేకాదు హృదయ స్పందన రేటు మెరుగుపడుతుంది. చన్నీళ్ళ స్నానం తో రక్తపోటు తగ్గుతుంది. చన్నీళ్ళ స్నానం చేస్తే చర్మ రంధ్రాలు బిగుతుగా మారతాయి. శరీరం నుండి నూనె ఉత్పత్తి తగ్గుతుంది. శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది గుండె జబ్బులు వంటి ప్రమాదాలు రాకుండా కాపాడుతుంది.
చర్మ ఆరోగ్యానికి చన్నీళ్ళ స్నానం
గుండె ఆరోగ్యానికి ఎంతగానో మంచి చేస్తుంది. చన్నీటి స్నానం మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది చర్మ సమస్యలు రాకుండా చేస్తుంది. వేసవిలో రాత్రిపూట చన్నీళ్ళ స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రతలు తగ్గి శరీరం చల్లబడి హాయిగా అనిపిస్తుంది. అయితే చన్నీళ్లతో స్నానం చేయాలనుకునేవారు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.
చన్నీళ్ళ స్నానం చెయ్యాలనుకుంటే వీరు జాగ్రత్త
రాత్రి సమయంలో చన్నీళ్ళతో స్నానం చేస్తే జలుబు దగ్గు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త అంతేకాదు రాత్రిపూట చన్నీళ్లతో తలస్నానం చేస్తే తలనొప్పి వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి చన్నీళ్లతో తల స్నానం చేయకుండా ఉంటేనే మంచిది. ఇక గుండె సమస్యలు ఉన్నవారు రాత్రిపూట చన్నీళ్లు స్నానం చేయకపోవడమే మంచిదని సలహా.
ఎండాకాలం చన్నీళ్ళ స్నానం మంచిదే.. కానీ
ఇక ఎండాకాలంలో చన్నీళ్ళ స్నానం చేయటం మంచిది అని సూచన. అయితే బాగా ఎండలో తిరిగి వచ్చి వెంటనే చన్నీళ్ళతో స్నానం చేయటం మంచిది కాదు. శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి వచ్చిన తర్వాత చన్నీళ్ళ స్నానం చెయ్యాలి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
పెద్దలనాటి 'చద్దన్నం'.. సమ్మర్ లో ఇలా టేస్టీగా.. -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు












Click it and Unblock the Notifications