దానిమ్మ తొక్కే కదా అని పారేస్తున్నారా? ఈ బెనిఫిట్స్ తెలిస్తే వదిలిపెట్టరు!

దానిమ్మ గింజలు మాత్రమే కాదు దానిమ్మ తొక్కలు కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి. చాలామంది దానిమ్మ గింజలు ఒలిచిన తర్వాత తొక్కలను పడేస్తూ ఉంటారు. అయితే దానిమ్మ గింజలలో, మాత్రమే కాదు తొక్కలలో ఉండే పోషకాలు మనకు బాగా ఉపయోగపడతాయి. దానిమ్మ తొక్కలలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్ మరియు ఖనిజాలు ఉంటాయి.

దానిమ్మ తొక్కలతో చాలా బెనిఫిట్స్
దానిమ్మ తొక్కలను మన ఆహారంలో భాగంగా చేసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. దానిమ్మ తొక్కలను ఎండబెట్టి పొడిలా చేసుకుని టీ చేసుకుని తాగవచ్చు. అంతేకాదు దానిమ్మ తొక్కల నుండి తీసిన సప్లిమెంట్లను కూడా మనం తీసుకోవచ్చు. దానిమ్మ తొక్కల పొడిని నీళ్లలో కలిపి పేస్టులా చేసి చర్మానికి, జుట్టుకి రాసుకుంటే కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అసలు దానిమ్మ తొక్కలతో ఎటువంటి ఆరోగ్యప్రయోజనాలు కలుగుతాయి అనేది ప్రస్తుతం చూద్దాం.

Are you throwing away pomegranate peel If you know these benefits you won t throw

దానిమ్మ తొక్కలతో ఈ ఆరోగ్య ప్రయోజనాలు
దానిమ్మ తొక్కలతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దానిమ్మ తొక్కల లోని ఫైబర్ మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. పేగు కదలికలను క్రమబద్దీకరిస్తుంది. దానిమ్మ తొక్కలు గుండె ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తాయి. ఇవి రక్తపోటును తగ్గించడానికి, శరీరంలోని కొలెస్ట్రాల్ ను నియంత్రించడానికి బాగా పనిచేస్తాయి. దానిమ్మ తొక్కలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శరీరంలో మంటను తగ్గించడానికి కూడా దోహదం చేస్తాయి.

దానిమ్మ తొక్కలతో అందం, ఆరోగ్యం
దానిమ్మ తొక్కలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు నోట్లో బ్యాక్టీరియా పెరుగుదలను నియంత్రిస్తాయి. దంత సమస్యలను నివారిస్తాయి. దానిమ్మ తొక్కలు జుట్టు ఆరోగ్యానికి ఎంతో బాగా పనిచేస్తాయి. చుండ్రు నివారించడానికి, జుట్టు రాలకుండా ఉండడానికి పేస్టులా చేసుకుని తలకు పెట్టుకుంటే మంచిది. ఇక దానిమ్మ తొక్కలను టీ గా గాని, పొడిగా గాని చేసుకొని ఆహారంలో భాగంగా తీసుకోవడం చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

దానిమ్మ తొక్కలు ఇలా తీసుకుంటేనే బెస్ట్
చర్మం యవ్వనంగా కనిపించడానికి, ముడతలు రాకుండా, వృద్ధాప్య ఛాయలు లేకుండా ఉండడానికి దానిమ్మ తొక్కలు ఉపయోగపడతాయి. దానిమ్మ తొక్కలో క్యాన్సర్ ను నివారించే లక్షణాలు ఉన్నాయి. క్యాన్సర్ కణాల పెరుగుదలను ఇవి నిరోధిస్తాయి.ఇన్ని ప్రయోజనాలు ఉన్న దానిమ్మ తొక్కలను ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిది. కాకుంటే మన ఆహారంలో దేనిని భాగంగా చేసుకున్నప్పటికీ దానిని మితంగానే తీసుకోవాలి. అధికంగా తీసుకోవడం అనర్థాలకు కారణం అవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+