మీ కిడ్నీలు క్షేమమేనా? ఈ లక్షణాలుంటే జాగ్రత్త!

మన శరీరంలో ఉండే ముఖ్యమైన అవయవాలలో మూత్రపిండాలు ఒకటి. మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. అందుకే మూత్రపిండాల ఆరోగ్యంపైన ఎవరూ పొరపాటున కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఇక మూత్రపిండాల ఆరోగ్యం గురించి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. కిడ్నీల ఆరోగ్యం పాడవుతుంది అని చెప్పడానికి కొన్ని సంకేతాలు కూడా మనకి కనిపిస్తాయి.

కిడ్నీల సమస్యలు ఉన్నప్పుడు కనిపించే లక్షణాలు
కిడ్నీల సమస్యలు ఉన్నప్పుడు కొన్ని లక్షణాలు కచ్చితంగా కనిపిస్తాయి. కాబట్టి వాటి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. కిడ్నీ సమస్యలు ఉంటే రాత్రి ఎక్కువగా మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. రాత్రి వేళల్లో ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యున్ని సంప్రదించి కిడ్నీల ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాలి. ఎవరైతే కిడ్నీల సమస్యలతో ఇబ్బంది పడతారో వారికి పాదాల వాపు ఉంటుంది.

Are your kidneys healthy Be careful if you have these symptoms

అలెర్జీలు, దురద... కిడ్నీలు జాగ్రత్త
సాధారణంగా మూత్రపిండాల వ్యాధుల వల్ల రాత్రి వేళల్లో పాదాలవాపు ఎక్కువగా ఉంటుంది. కిడ్నీ సమస్యలతో బాధపడేవారు స్కిన్ ఎలర్జీలను కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. స్కిన్ పొడిబారినట్టుగా అనిపించిన ఎక్కువ దురదగా అనిపించిన కిడ్నీ సమస్యలు ఉన్నట్టు గుర్తించాలి. కిడ్నీల సమస్యలు ఉన్నప్పుడు రక్తంలో మలినాలు, వ్యర్ధాలు పేరుకు పోతాయి. దీని కారణంగా అనేక అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి.

వికారం, వాంతులు ఉంటే కిడ్నీల సమస్య ఉన్నట్టే
ముఖ్యంగా నాలుక పైన ఉండే టేస్ట్ బడ్స్ సరిగ్గా పని చేయవు. ఎవరైనా ఇటువంటి లక్షణాలతో బాధపడితే వెంటనే కిడ్నీ పరీక్ష చేయించుకోవాలి. కిడ్నీ సమస్యలు ఉంటే వికారము, వాంతులు వంటి ఇబ్బందులు వస్తాయి. రక్తంలో వ్యర్ధాలు పేరుకుపోవడం కారణంగా ఈ వికారం సమస్య ఏర్పడుతుంది. కనుక ఎవరైనా వికారం, వాంతులు వంటి సమస్యలతో ఇబ్బంది పడితే నిర్లక్ష్యం చేయకుండా కిడ్నీల పరీక్ష చేయించుకోవాలి.

అలసట, బలహీనత ... ఉంటే కిడ్నీల ఆరోగ్యం డేంజర్ లో
విపరీతంగా అలసటగా అనిపించడం, బలహీనంగా మారడం కూడా కిడ్నీలకు సంబంధించి సమస్యలు ఉన్నవారిలోనే జరుగుతుంది. కనుక ఇటువంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యున్ని సంప్రదించి చికిత్స తీసుకోవాలి. ఇక వెన్నులో , ప్రక్కటెముకల క్రింద నొప్పిగా ఉంటే కూడా నిర్లక్ష్యం చెయ్యకూడదు. ఊపిరి ఆడకపోవటం, మూత్రంలో నురగ రావటం, మూత్రం రంగు మారటం వంటి లక్షణాలు ఉంటే కూడా కిడ్నీల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+