పొద్దున్నే లేవగానే మీ పిల్లలు సోషల్ మీడియాలో మునిగిపోతున్నారా? అయితే హెచ్చరిక!
భారతీయ యువతలో ఆరోగ్యకరమైన దినచర్య పోయింది. ప్రస్తుతం అనారోగ్యకరమైన దినచర్య కొనసాగుతుంది. ఉదయం నిద్ర లేవడం తోనే ఫోన్ పట్టుకోవడం, సోషల్ మీడియాలో మునిగిపోవడం, ట్విట్టర్ పోస్టులు, instagram పోస్టులు, రీల్స్ చూడడం, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లను ఫాలో అవడం ఇలాంటి అనారోగ్యకరమైన అలవాట్లు నేటి యువత జీవితం పైన తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి.
ఉదయాన్నే సోషల్ మీడియా.. రోగ గ్రస్తమవుతున్న యువత
ఫలితంగా ప్రతిరోజు ఉదయం చేయవలసిన పనులేవీ యువత చేస్తున్న పరిస్థితి కనిపించడం లేదు. కాసేపు శారీరక వ్యాయామం కానీ, సమయానికి అల్పాహారం గాని చేస్తున్న పరిస్థితి లేదు. ఏ సమయానికి నిద్ర పోతున్నారు? ఏ సమయానికి నిద్ర లేస్తున్నారు? అనేది కూడా తెలుస్తున్న పరిస్థితి లేదు. అడ్డదిడ్డమైన జీవనశైలి కారణంగా యువత చిన్న వయసులోనే అనారోగ్యం బారిన పడుతోంది.

యువతను మార్చటంలో తల్లిదండ్రులది, అధ్యాపకులది కీలకపాత్ర
యువతలో అనారోగ్యానికి ప్రధాన కారణం ప్రస్తుతం పెరిగిపోయిన సోషల్ మీడియా పిచ్చి అని కూడా చెప్పవచ్చు. అయితే సోషల్ మీడియాని ఎక్కువగా వినియోగించే యువతను ఆ అలవాటు నుంచి నిదానంగా మార్చాలి. అందులో మంచి వాటిని ఎంపిక చేసుకోవడంలో, ఆరోగ్యానికి దోహదం చేసే కంటెంట్ ను చూడడానికి, వాటిని అనుసరించడానికి ప్రేరేపించడం లో తల్లిదండ్రులు, కళాశాలలోని అధ్యాపకులు వారికి సహకరించాల్సిన అవసరం ఉంది.
సోషల్ మీడియాలోనూ అలవాటు చెయ్యాల్సిన కంటెంట్ ఇదే
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లు ప్రతిరోజు తమ రోజువారి అలవాట్లను పంచుకుంటారు. వీటిని మిలియన్ల మంది అనుసరిస్తూ ఉంటారు. ప్రధానంగా యువత వీరిని అనుసరిస్తారు. అయితే యువత అనుసరించేవారు ముఖ్యంగా వారికి ఒక నియమిత జీవనశైలిని అలవాటు చేసే కంటెంట్ ను అందించే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స ర్స్ అయితే బాగుంటుంది. అటువంటి వాటిని చూడడానికి తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే పిల్లలలో ఆరోగ్యం పైన శ్రద్ధ పెరుగుతుంది.
సోషల్ మీడియాకు అడిక్ట్ అయితే దీర్ఘకాల దుష్ప్రభావాలు
అలా కాకుండా వాళ్ళు ఏం చూసినా పట్టదు అన్నట్టు వ్యవహరిస్తే చివరికి యువత అనారోగ్యం బారిన పడాల్సి వస్తుంది. ఇది వీరి ఆరోగ్యం పైన దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపిస్తుంది ఉదయాన్నే సోషల్ మీడియా చూడటం వల్ల వీరిపైన విపరీతమైన ఒత్తిడి, ఆందోళన పెరుగుతుంది . నిద్ర లేచిన వెంటనే సోషల్ మీడియా ఉపయోగించటం వల్ల వీరికి నిద్ర భంగం కూడా కలుగుతుంది.
యువత సోషల్ మీడియా అలవాటుపై జాగ్రత్త
సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడపటం వలన బయట ప్రత్యక్ష సంభాషణలు తగ్గిపోయి సంబంధాలు దెబ్బతింటాయి. ఇక సోషల్ మీడియాలో ఎక్కువ సమయం గడిపితే రోజంతా మనం చేయాల్సిన పనుల పైన దృష్టి కూడా తక్కువ అవుతుంది. కనుక యువతను ఈ అలవాటును మాన్పించడానికి, వారిని మార్చడానికి పేరెంట్స్ తగిన విధంగా కృషి చేయాల్సిన అవసరం ఉంది.
-
ఈ ఫోటోలో ఎన్ని జంతువులు ఉన్నాయో చెప్పగలరా..? -
"'ధురంధర్' సినిమానే కాదు.. ప్రభుత్వానికి రాసిన ప్రేమలేఖ" -
నిర్మల్ జిల్లాలో పాము పిల్లల కలకలం.. -
పుకార్ల దేశం.. అందుకే పెట్రోల్ బంకుల వద్ద ఆ క్యూలు! -
ఈ చేపల్లో తేడాగా ఉన్నది ఏదో కనిపెట్టగలరా..? -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!!












Click it and Unblock the Notifications