జుట్టు పెరుగుదలను అడ్డుకుంటున్న ఈ ఆహారాలతో జాగ్రత్త!
చాలామంది తమ జుట్టు పెరగడం లేదని తమ జుట్టు ఆరోగ్యంగా లేదని బాధపడుతూ ఉంటారు. అటువంటి వారు జుట్టు పెరగడానికి తీసుకునే ఆహారాలను గురించి తెలుసుకొని వాటిని తింటే జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. మన జుట్టుకు కూడా పోషకాలు కావాలి. ఆ పోషకాలు ఏ ఆహారంలో ఉంటాయో తెలుసుకొని కచ్చితంగా తినాలి. అప్పుడే మన జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.
జుట్టు పెరుగుదలను నిరోధించే ఆహారాలు
ఇదే సమయంలో జుట్టు పెరగడానికి తినాల్సిన ఆహార పదార్థాలను తెలుసుకోవడమే కాకుండా మన జుట్టు పెరుగుదలను అడ్డుకుంటున్న ఆహారాల గురించి కూడా మనం తెలుసుకోవాలి.మన జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీసి మన జుట్టు పెరుగుదలను అడ్డుకునే అనేక ఆహారాలు ఉంటాయి. కొన్ని రకాల చెత్త ఆహారాలు మీ జుట్టు రాలిపోయేలా చేస్తాయి. జుట్టు పెరుగుదలను అడ్డుకుంటాయి. అటువంటి వాటిలో ముఖ్యంగా చెప్పవలసింది ఎక్కువగా స్వీట్లు, కేకులు తినడం.

ఇవి తింటున్నారా? మీ జుట్టు రాలిపోవటం పక్కా
చక్కెరతో తయారు చేసిన ఆహారాలను తింటే జుట్టు త్వరగా రాలిపోతుంది. చక్కెర అధికంగా ఉండే ఆహారాలు తినడం వల్ల ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తుంది. ఇది హార్మోన్లలో అసమతుల్యతకు కారణం అవుతుంది. జుట్టు రాలిపోవడానికి దోహదం చేస్తుంది. అధికంగా చక్కెర ఉన్న ఆహారాలు తీసుకోవడం జుట్టుకుదుళ్ళను దెబ్బతీస్తుంది.
ఇవి తింటే జుట్టు పెరగటం కష్టమే
ఇక వేపుళ్ళు.. కొంతమంది డీప్ ఫ్రై చేసిన ఆహారాలను ఎక్కువగా తింటారు. డీప్ ఫ్రై చేసిన ఆహారాలలో ట్రాన్స్ ఫ్యాట్, అనారోగ్య కరమైన నూనెలు ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీస్తాయి. విపరీతంగా ఉప్పు వేసిన ఆహారాలు కూడా జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఉప్పు ఎక్కువగా తినడం గుండె ఆరోగ్యానికి మంచిది కాదు. ఉప్పు ఎక్కువగా తినడం జుట్టు సమస్యలకు కూడా కారణం అవుతుంది.
ఇవి తింటే చుండ్రు సమస్యతో జుట్టు రాలిపోతుంది
అధికంగా ఉప్పు తీసుకోవడంతో డిహైడ్రేషన్ సమస్య వస్తుంది. ఇది మన జుట్టుకుదుళ్ళు సహజ నూనెలను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఫలితంగా జుట్టు పొడిబారిపోయి రాలిపోతుంది. జుట్టు పెరగకుండా నిరోధించే ఆహారాలలో పాల ఉత్పత్తులు ఒకటి. పాలు కొన్నిసార్లు మన జుట్టు నూనె ఉత్పత్తిని పెంచి చుండ్రు సమస్యకు మొటిమల సమస్యకు కారణం అవుతాయి.
జుట్టు ఆరోగ్యం కోసం వీటిని తినేటప్పుడు జాగ్రత్త
జుట్టు ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే వాటిలో పాలు కూడా ఒకటి కాబట్టి పాల పదార్థాలు జుట్టు ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయి. హై మెర్క్యూరీ ఫిష్.. ట్యూనా, స్వోర్డ్ ఫిష్, మాకేరేల్ వంటి కొన్ని చేపలలో అధిక స్థాయిలో మెర్కురీ ఉంటుంది. ఇక ఈ చేపలను తినడం వల్ల ఇది జుట్టు రాలడానికి కారణం అవుతుంది. జుట్టు ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ఈ ఆహారాల విషయంలో జాగ్రత్తగా ఉండండి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications