Sugar patients: షుగర్ పేషెంట్స్‌కు ఈ ఫ్రూట్స్ యమ డేంజర్.. తినేముందు ఒక్కసారి ఆలోచించండి..

Fruits for Diabetes: ఇతర వ్యాధులతో పోలిస్తే మధుమేహం కొంత భిన్నంగా ఉంటుంది. దీని బారిన పడితే రుచికరమైన ఆహారం తీసుకునేందుకు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే తినే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఏమాత్రం అశ్రద్ధ చేసినా రక్తంలో షుగర్ స్థాయి పెరిగిపోయే ప్రమాదం ఉంది. అందుకే చక్కెర లేని, ఫైబర్ ఎక్కువగా ఉండే విధంగా డైట్ మార్చుకోవాలి.

ఆరోగ్యానికి పండ్లు ఎంతో మేలు చేస్తాయి. రోజువారీ ఆహారంలో వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు, ప్రొటీన్లతో పాటు వివిధ రకాల ఖనిజ లవణాలు లభిస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా పండ్లు తినాలని వైద్యులు సూచిస్తారు. అయితే కొన్ని రకాల పండ్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తినకూడదని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే అవి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. కాబట్టి అటువంటి వారికి ఇవి హానికరంగా పరిగణిస్తారు.

Bad fruits for Diabetic patients

పండ్లలో రారాజుగా పరిగణించే మామిడి షుగర్ పేషెంట్స్‌కు అత్యంత ప్రమాదకరం. చక్కెరతో పాటు కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే మామిడి వారికి పెద్ద ముప్పుగా పరిణమిస్తుంది. శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచి, వారి ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం చూపుతుంది. రక్తంలో చక్కెర మోతాదు కూడా వేగంగా ఎక్కువవుతుంది.

పైనాపిల్‌లో చక్కెర పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచుతుంది. అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) కలిగి ఉండటంతో డయాబెటిక్ రోగులు ఏమాత్రం దీన్ని తినకూడదు. పైనాపిల్ తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు అసాధారణంగా పెరుగుతాయి. తద్వారా రక్తంలో చక్కెర నియంత్రణ లేకుండా పోతుంది.

అరటిపండులో సహజంగానే చక్కెర అధికంగా ఉంటుంది. మధ్యస్థం నుంచి అధిక రేంజ్ GI కలిగి, రక్తంలో చక్కెరను అకస్మాత్తుగా పెంచుతుంది. డయాబెటిక్ రోగులకు ఈ పండు సరైనది కాదు. ముఖ్యంగా పండిన అరటిపండ్లు మధుమేహ వ్యాధిగ్రస్తులకు మరింత ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. చివరగా, డయాబెటిస్ రోగులు ద్రాక్ష తినడం వల్ల వెంటనే చక్కెర స్థాయి పెరుగుతుంది. ఇందులో ఉండే ఫ్రక్టోజ్ మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రమాదకరం. పరిమిత మోతాదులో తీసుకుంటే ఫర్వాలేదు కానీ డోస్ ఎక్కువైతే మాత్రం తిప్పలు తప్పవు.

పండ్లను తీసుకునే విషయంలో మధుమేహ వ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక చక్కెర స్థాయిలు కలిగిన పండ్లకు బదులుగా ఆపిల్, బొప్పాయి వంటి తక్కువ GI ఉన్న పండ్లు వారి ఆరోగ్యానికి ఉత్తమమని సూచిస్తున్నారు. వైద్యుడిని సంప్రదించిన అనంతరం చక్కెర స్థాయిలు అదుపులో ఉంచుకునే విధంగా పండ్లను తీసుకోవడం మంచిదని సలహా ఇస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+