చెప్పులు లేకుండా 20 నిముషాలు నడవండి.. ఆశ్చర్యపోతారు

చెప్పులు లేకుండా ప్రతిరోజు కనీసం 20 నిముషాలు నడవండి అని వైద్యులు సూచిస్తూనే ఉంటారు. కనీసం తడి గడ్డిమీదైనా నడవాలని చెబుతుంటారు. కానీ ఆ సలహాను పెడచెవిన పెట్టేవారే ఎక్కువ. మార్నింగ్ వాక్ కు వెళితే షూ కచ్చితంగా ఉంటాయి. పక్కనే విప్పేసి ఒక 20 నిముషాలు నడిచి డాక్టరుగారు చెప్పింది పాటించాలని ఒకరు కూడా అనుకోరు. కానీ ఆ నడకవల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలుంటయంటే.. లెక్కే లేదు.

కళ్లకు ఉపయోగం: పచ్చటి గడ్డిపై చెప్పులు లేకుండా నడవడంవల్ల అరికాళ్లపై ఒత్తిడి పడుతుంది. నిజానికి మన శరీరంలోని అనేక భాగాల పీడనం మన అరికాళ్లలో ఉంటుంది. కళ్లు కూడా ఇందులో భాగమే. సరైన పాయింట్ పై ప్రెజర్ ఉండటంవల్ల మన కంటిచూపు మెరుగుపడుతుంది.

walkingwithoutshoes-

అలెర్జీ చికిత్స: మంచుతో నిండిన గడ్డిపై నడవడం ఆరోగ్యానికి ఎంతో మేలు. ఇది గ్రీన్ థెరపీని ఇస్తుంది. పాదాల కింద ఉండే మృదుకణాలతో సంబంధమున్న నరాలు చురుగ్గా మారతాయి. అక్కడి నుంచి మెదడుకు సంకేతాన్ని ప్రసారం చేయడంవల్ల అలెర్జీ లాంటివి దూరమవుతాయి.

పాదాలకు విశ్రాంతి: తడితో ఉన్న గడ్డిపై కొద్దిసేపు నడిచినా చాలు.. అద్భుతమైన ఫలితాలు దక్కుతాయి. పాదాల కండరాలు సడలింపును పొందుతాయి. దీనివల్ల కాళ్ల నొప్పులు తగ్గుతాయి.

టెన్షన్‌ దూరం: గడ్డిమీద నడవడంవల్ల మనిషి మానసిక ఆరోగ్యం ఎంతో ప్రభావవంతమవుతుంది. మైండ్ రిలాక్స్ అవడంతోపాటు ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది.

గడ్డిపై నడవడంవల్ల శరీరం నుంచి ధనాత్మక అయాన్లు తొలగించబడతాయి. దీనివల్ల రుణాత్మక అయాన్లకు స్థలం దొరుకుతుంది. ఇవి నాణ్యమైన నిద్రను అందజేయడంలో తోడ్పడుతుంది.

శరీరంలో రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఎర్ర రక్త కణాల ఉపరితలంలోని ఛార్జ్ మెరుగుపడుతుంది. రక్తంలో అత్యధిక చిక్కదనం నివారించబడుతుంది. దీనివల్ల గుండెకు సంబంధించిన వ్యాధులు సంభవించే ప్రమాదం తగ్గుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+