Beauty tips: దీపికా పదుకొనే మెరిసే చర్మ రహస్యాలివే!!
ప్రముఖ మోడల్, బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె చర్మ సౌందర్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆరోగ్యంగా అందంగా కనిపించడానికి, తన గ్లామర్ ను మెయింటైన్ చేయడానికి ప్రతినిత్యం తప్పనిసరిగా కేర్ తీసుకుంటారు. దీపికా పదుకొనే చర్మం, జుట్టు ఎప్పుడూ నిగారింపును సంతరించుకుని చూపరులను ఆకర్షిస్తాయి.
అసలు దీపికా పదుకొనే ఎటువంటి బ్యూటీ టిప్స్ ను ఫాలో అవుతున్నారు. ఆమె చర్మ సౌందర్య రహస్యం ఏమిటి అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే సన్ స్క్రీన్స్ కు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తారు. సూర్యుడి అత్యంత హానికరమైన యూవీ కిరణాల నుండి చర్మాన్ని రక్షించుకోవడానికి ప్రతిరోజు దీపికా పదుకొనే రెండుసార్లు సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేస్తారు.

శరీరం డీహైడ్రేట్ కాకుండా కాపాడుకోవడానికి ఆమె ఎక్కువగా నీటిని తాగుతారు. చర్మం నిగారింపు కోసం పండ్ల రసాలను తాగుతారు. అంతేకాదు మంచి అందమైన ఆరోగ్యమైన జుట్టు కోసం దీపికా పదుకొనే అప్పుడప్పుడు కొబ్బరి నూనెతో తలకు మసాజ్ చేసుకుంటారు. దీపికా అందాల రహస్యాలలో ముఖ్యమైనదిగా వ్యాయామాన్ని చెప్పొచ్చు.
దీపికా పదుకొనే అనేక బ్యూటీ ప్రొడక్ట్స్ ను వాడటంతో పాటు, ప్రతిరోజు వ్యాయామం చేస్తారు. మంచి శరీర ఆకృతి కోసం, ఆరోగ్యకరమైన చర్మం కోసం దీపికా పదుకొనే వ్యాయామం చేస్తారు. అంతేకాదు ప్రతిరోజు దీపిక పదుకొనే ముఖంపైన ఐస్ క్యూబ్స్ తో మసాజ్ చేసుకుంటారు. ముఖానికి ఐస్ లేదా కోల్డ్ ప్రెస్ అప్లై చేయడం వల్ల ముఖంలో వాపు తగ్గుతుంది. అందుకే దీపికా పదుకొనే వాటిని వాడతారు.
హిందీ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ముద్ర వేసిన దీపికా పదుకొనే నిద్ర విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఆమె రోజుకి 8 గంటల పాటు నిద్రకు కేటాయిస్తారు. ఇక ఆహార నియమాలను పాటిస్తారు. తనకు అవసరమైన డైట్ మాత్రమే దీపికా పదుకొనే తీసుకుంటారు.












Click it and Unblock the Notifications