Beauty tips: అందానికి చక్కెర.. సౌందర్యాన్ని పెంచే చక్కెరను ఎన్ని విధాలుగా వాడొచ్చో తెలుసా!!

చక్కెర అందానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అందాన్ని మెరుగుపరిచే వివిధ స్క్రబ్‌లను తయారు చేయడానికి చక్కెరను ఉపయోగించవచ్చు. దీంతో మీరు మృదువైన మెరిసే చర్మాన్ని పొందవచ్చు.

అందంగా ఉండాలని ఎవరు కోరుకోరు. ప్రతి ఒక్కరు అందంగా ఉండడం కోసం మార్కెట్లో దొరికే వివిధ సౌందర్య ఉత్పత్తులను తెచ్చి వినియోగిస్తూ ఉంటారు. తమ చర్మాన్ని మెరిసేలా మృదువుగా ఉండేలా చేయడం కోసం అనేక సౌందర్య ఉత్పత్తులు కొనుగోలు చేసి వాడుతున్నారు. అయితే మనం నిత్యం ఇంట్లో ఉపయోగించుకునే చక్కెరలోనే మన సౌందర్యాన్ని ఇనుమడింపజేసే బోలెడు రహస్యాలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. మన చర్మం మృదువుగా, కాంతివంతంగా మారడానికి చక్కెరతో తయారు చేసుకునే స్క్రబ్ లు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇక వాటిని గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

కాఫీ పొడి , షుగర్ , కొబ్బరి నూనెలతో స్క్రబ్

కాఫీ పొడి , షుగర్ , కొబ్బరి నూనెలతో స్క్రబ్

ఇంట్లోనే సులభంగా తయారు చేసుకుని ఉపయోగించే షుగర్ స్క్రబ్ లలో ముఖ్యమైనవి. కాఫీ పొడి, షుగర్, మరియు కొబ్బరినూనెను మిక్స్ చేసి ఉపయోగించే స్క్రబ్ ఎంతో బాగా పనిచేస్తుంది. ఈ స్క్రబ్ తో కాసేపు ముఖం మెడ చేతులపై నిదానంగా రుద్దుతూ మర్దన చేసి, ఓ అరగంట పాటు ఉంచుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ స్క్రబ్ చర్మం పై ఉన్న మృత కణాలను తొలగించి మన శరీరాన్ని మృదువుగా, కాంతివంతంగా మారేలా చేస్తుంది. ఈ స్క్రబ్ ఎలాంటి చర్మాన్ని అయిన సున్నితంగా అందంగా మారేలా చేస్తుంది.

జిడ్డు చర్మం ఉంటే ఈ షుగర్ స్క్రబ్ తో మంచి ఫలితం

జిడ్డు చర్మం ఉంటే ఈ షుగర్ స్క్రబ్ తో మంచి ఫలితం

జిడ్డు చర్మం, మొటిమలు ఉన్నవారికి ఓటు మీల్ తో పాటు షుగర్ ను కలిపి స్క్రబ్ తయారు చేసుకుంటే ఎంతో బాగా పనిచేస్తుంది. ఇది జుట్టు చర్మం గల వారికి చర్మం నుండి అదనపు నూనెను తీసుకుని చర్మం కాంతివంతంగా మారేలా చేస్తుంది. దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మొటిమలు రాకుండా అడ్డుకుంటాయి. ఒక టేబుల్ స్పూన్ ఓట్స్ తీసుకుని దానికి ఒక టీ స్పూన్ పంచదార కలిపి పేస్ట్ చేసి కొన్ని చుక్కల ఆలివ్ నూనె లేదా తేనెను జోడించి ముఖానికి మాస్క్ లో వేసుకోండి. ఆపై అరగంటసేపు ఉంచి, చల్లటి నీళ్లతో ముఖం కడుక్కుంటే చాలా చక్కని నిగారింపు ముఖానికి వస్తుంది

డెడ్ స్కిన్ తొలగించుకోవాలంటే ఈ స్క్రబ్ బెస్ట్

డెడ్ స్కిన్ తొలగించుకోవాలంటే ఈ స్క్రబ్ బెస్ట్

ముఖంపై పేరుకుపోయే డెడ్ స్కిన్ పొరను తొలగించడంలో గ్రీన్ టీ మరియు చక్కెర స్క్రబ్ బాగా పనిచేస్తుందని చెప్పొచ్చు. దీనికోసం అర టీ స్పూన్ చక్కెర, ఆలివ్ నూనె లేదా కొబ్బరి నూనె, గ్రీన్ టీ ఆకులను కలిపి ఒక పేస్టులా తయారు చేసుకుని ముఖం చేతులు వీపు భాగంలో స్క్రబ్ చేసుకోవాలి. కాసేపు మసాజ్ చేసి, ఒక అర గంట సేపు ఉంచుకొని ఆపై శుభ్రంగా చల్లటి నీటితో కడుక్కుంటే డెడ్ స్కిన్ మొత్తం తొలగిపోయి స్కిన్ ఫ్రెష్ గా కనిపిస్తుంది.

ఆలివ్ ఆయిల్ మరియు షుగర్ స్క్రబ్ తో బెస్ట్ రిజల్ట్

ఆలివ్ ఆయిల్ మరియు షుగర్ స్క్రబ్ తో బెస్ట్ రిజల్ట్

మోచేతులు, మోకాళ్లు, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ తొలగించడం కోసం ఆలివ్ ఆయిల్ మరియు షుగర్ స్క్రబ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనిని తయారు చేసుకోవడానికి ఒక టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ తీసుకుని, ఒక టీ స్పూన్ చక్కెరతో బాగా కలిపి ఈ పేస్టును ముఖంపై స్క్రబ్ చేస్తే సహజమైన గ్లో వస్తుంది. అంతే కాదు మోచేతులు మోకాళ్ళ వద్ద నల్లబడిన చర్మాన్ని శుభ్రం చేయడానికి, డెడ్ స్కిన్ ను తొలగించడానికి ఈ స్క్రబ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇవి కొన్ని మాత్రమే. చక్కెరతో బోలెడన్ని స్క్రబ్స్ చేసుకోవచ్చు. అందం కోసం షుగర్ పని చేసినంత మరే వస్తువు పని చెయ్యదు. మరెందుకు ఆలస్యం షుగర్ తో స్క్రబ్స్ చేసి ఒక పట్టు పట్టెయ్యండి. మంచి నిగారింపును సొంతం చేసుకోండి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+