బాన పొట్టతో ఇబ్బందా? ఈ టిప్స్ ఫాలో అయితే ఫలితం ఉంటుంది!!
ప్రస్తుత కాలంలో ఊబకాయం అతి పెద్ద సమస్యగా మారింది. విపరీతంగా బరువు పెరగడంతో, అధిక బరువు సమస్యతో అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న వారు చాలామంది ఉన్నారు. వివిధ రకాల ఆహారపు అలవాట్ల కారణంగా, చెడు జీవన శైలి కారణంగా చాలామంది ఊబకాయ బాధితులుగా మారుతున్నారు. శారీరక శ్రమ లేకపోవడం, ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోకపోవడం కూడా ఊబకాయానికి ప్రధాన కారణంగా మారుతుంది.
అసహ్యంగా పెరుగుతున్న పొట్ట
అయితే ఊబకాయం నుంచి బయట పడాలి అని భావించేవారు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఊబకాయం లోను కేవలం పొట్ట సమస్యతో బాధపడుతున్న వారు చాలామంది ఉన్నారు. శరీరం అంతా నార్మల్ గా ఉన్నా కేవలం పొట్ట భాగంలో మాత్రమే అసహ్యంగా బెల్లీ ఫ్యాట్ ఉండడంతో ఇది తగ్గితే బాగుండు అని అనుకోని వారు లేరు అంటే నమ్మాల్సిందే.

ఈ టిప్స్ తో బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది
అందుకే బెల్లీ ఫ్యాట్ తగ్గాలి అని భావించేవారు ఎన్ని ప్రయత్నాలు చేసినా బెల్లీ ఫ్యాట్ తగ్గకపోతే అటువంటివారు చిన్న చిన్న టిప్స్ పాటించి బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ తగ్గాలి అని భావించేవారు మంచినీళ్లు తాగే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. నీళ్లు తాగేటప్పుడు ఎప్పుడు కూర్చునే తాగాలి. దీనివల్ల జీర్ణక్రియ పెరుగుతుంది. మెటపాలిజం మెరుగుపడుతుంది.
మంచి నీరు తాగితే పొట్ట ఫ్యాట్ మాయం
పొట్ట భాగంలో ఉన్న ఫ్యాట్ కరిగించాలంటే మనం తాగే నీరు కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి నీళ్లు తాగే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలి అని భావించేవారు ఆహారంలో మొదట ఎక్కువ ఫైబర్ ఉన్న కంటెంట్ ను తీసుకోవాలి. క్యారెట్, కీరా, వంటి వెజిటబుల్స్ సలాడ్ లను తీసుకోవాలి. ఆ తర్వాత మన శరీరానికి కావలసిన ప్రోటీన్ ను తీసుకోవాలి.
ఆహారం విషయంలో ఇలా ఉండాలి
కార్బోహైడ్రేట్లను తక్కువగా తీసుకోవాలి. మనం తీసుకునే ఆహారంలో అన్నాన్ని తగ్గించి ప్రోటీన్లు ఎక్కువగా ఉండే పప్పులను, కూరలను ఎక్కువగా తినాలి. ఇది మీ బెల్లీ ఫ్యాట్ తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాదు ప్రతిరోజు తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. వ్యాయామాన్ని జీవితంలో భాగంగా చేసుకోవాలి.
చెయ్యకూడని తప్పు ఇదే
కొంతకాలం వ్యాయామం చేయడం కొంతకాలం మానేయడం, కొంతకాలం డైట్ ఫాలో చేయడం కొంతకాలం మానేయడం మంచిది కాదు. ఏదైనా ఒక క్రమ పద్ధతిలో నిత్యం చేసినప్పుడే కచ్చితంగా మంచి ఫలితం వస్తుంది. ఆరంభ శూరత్వం కాకుండా అది ఎప్పటికీ పాటించేలా జీవన విధానం ఉండాలి. కాబట్టి బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవాలి అనుకునేవారు ఈ చిన్న చిన్న టిప్స్ ను ఫాలో అయితే మంచిది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications