షుగర్​ లెవల్స్​ కంట్రోల్లో ఉండాలా, ఈ పండ్లతో ఊహించని విధంగా..!!

టైప్ 2 డ‌యాబెటిస్. ఈ మధ్య కాలంలో ఎక్కువ మందిలో కనిపిస్తోంది. అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న విధానం వ‌ల్ల వ‌స్తుంది. ప్ర‌స్తుతం చాలా మంది చిన్న వ‌య‌స్సులోనే టైప్ 2 డయాబెటిస్ బారిన ప‌డుతున్నారు. డ‌యాబెటిస్ వ‌స్తే ఆహారం .. జీవన శైలిలో మార్పులు అవసరం. ఈ క్ర‌మంలోనే షుగ‌ర్ ఉన్న‌వారు ఏ పండ్ల‌ను తినాలనే సందేహలతో ఉంటారు. మధుమేహం ఉన్న వారు అన్న రకాల పండ్లు తినకూడదు. అయితే, కొన్ని ర‌కాల పండ్ల‌ను డ‌యాబెటిస్ ఉన్న‌వారు తింటే ఎంతో మేలు జ‌రుగుతుంది.

షుగ‌ర్ ఉన్న‌వారికి కివి పండ్లు ఎంతో మేలు చేస్తాయి. డ‌యాబెటిస్ ఉన్న‌వారు రోజూ ఒక కివి పండును తింటే షుగ‌ర్ లెవ‌ల్స్‌ను నియంత్ర‌ణ‌లో ఉంచుకోవ‌చ్చు. అలాగే షుగ‌ర్ ఉన్న‌వారు రోజూ నేరేడు పండ్ల‌ను కూడా తినాలి. నేరేడు పండ్ల‌లో ఉండే స‌మ్మేళ‌నాలు షుగ‌ర్‌ను స‌మ‌ర్థ‌వంతంగా త‌గ్గిస్తాయి. అయితే షుగ‌ర్ త‌గ్గేందుకు నేరేడు విత్త‌నాల‌ను కూడా తీసుకోవ‌చ్చు. వీటి పొడి మ‌న‌కు మార్కెట్‌లో ల‌భిస్తుంది. దీన్ని ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో ఒక టీస్పూన్ మోతాదులో క‌లిపి భోజ‌నానికి 30 నిమిషాల ముందు రోజుకు 2 పూట‌లా తీసుకుంటే షుగ‌ర్‌ను కంట్రోల్ చేయ‌వ‌చ్చు. ఈ చిట్కా షుగ‌ర్‌కు బాగా ప‌నిచేస్తుంది. అలాగే స్టార్ ఫ్రూట్‌ను తింటున్నా కూడా షుగ‌ర్ అదుపులో ఉంటుంది. డ‌యాబెటిస్ ఉన్న‌వారికి స్టార్ ఫ్రూట్ ఎంతో మేలు చేస్తుంది. ఇవి చూసేందుకు ఆకుప‌చ్చ, ప‌సుపు రంగు క‌లిసిన క‌ల‌ర్‌లో ఉంటాయి. న‌క్షత్రాల మాదిరిగా క‌నిపిస్తాయి. వీటిని తింటున్నా ఎంతో మేలు జ‌రుగుతుంది.

best-fruit-choices-for-diabetic-patients-to-lower-sugar-levels-here-the-details

అదే విధంగా డ‌యాబెటిస్ ఉన్న‌వారు జామ‌కాయ‌ల‌ను కూడా రోజూ తినాలి. జామ కాయ‌ల్లో విట‌మిన్లు ఎ, సిలతోపాటు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి షుగ‌ర్ లెవ‌ల్స్‌ను తగ్గించి డ‌యాబెటిస్ అదుపులో ఉండేలా చేస్తాయి. జామ‌కాయ‌ల‌ను రోజూ తింటుంటే ఎంతో మేలు జ‌రుగుతుంది. చెర్రీ పండ్లు కూడా షుగర్ ఉన్న‌వారికి మేలు చేస్తాయి. ఈ పండ్లు తియ్య‌గా ఉన్న‌ప్ప‌టికీ వీటి గ్లైసీమిక్ ఇండెక్స్ త‌క్కువే. ఇవి డ‌యాబెటిస్ వ్యాధిగ్ర‌స్తులకు మంచి ఆహారంగా చెప్ప‌వ‌చ్చు. బెర్రీ పండ్ల‌ను తింటున్నా కూడా షుగ‌ర్‌ను అదుపులో ఉంచుకోవ‌చ్చు. స్ట్రాబెర్రీలు, రాస్ప్ బెర్రీలు, క్రాన్ బెర్రీల‌ను తింటే షుగ‌ర్ స‌మ‌ర్థ‌వంతంగా అదుపులో ఉంటుంది. పైనాపిల్ కూడా డ‌యాబెటిస్ వ్యాధిగ్ర‌స్తుల‌కు మేలు చేస్తుంది. ఇది జీర్ణ వ్య‌వ‌స్థ‌ను శుభ్రంగా ఉంచుతుంది. అయితే, ఏ పండు అయినా షుగరు ఉన్నవారు పరిమితికి మించకుండా తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. ఆహారంలో ఎలాంటి మార్పులు చేయాలనకున్నా వైద్యుల సలహా మేరకే నిర్ణయం తీసుకోవటం మంచిందని నిపుణులు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+